Samsung Galaxy F02s price and specifications: తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కోసం వేచిచూస్తున్న వారికి దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. రూ. 9 వేల లోపు ధరలోనే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, పెద్ద డిస్ప్లే, ఎక్కువ స్టోరేజీ, వెనకాల ట్రిపుల్ కెమెరాతోపాటు మరిన్ని ఆకట్టుకునే ఇతర ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ F02s (Samsung Galaxy F02s) పేరుతో శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఆ ఫోన్ విశేషాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
8GB RAM + 128GB స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌కి అదనంగా ఇదే మోడల్లో ఇండియాలో మరో కొత్త వేరియెంట్ లాంచ్ అయింది. 512GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లోనూ 8జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కలిగిన మరో, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇవే కాకుండా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.