Samsung Galaxy S10 Lite 512GB varient price : 512GB స్టోరేజీ, 48MP కెమెరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా ?

8GB RAM + 128GB స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌కి అదనంగా ఇదే మోడల్లో ఇండియాలో మరో కొత్త వేరియెంట్ లాంచ్ అయింది. 512GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌లోనూ 8జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కలిగిన మరో, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇవే కాకుండా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 

Last Updated : Feb 28, 2020, 06:59 PM IST
Samsung Galaxy S10 Lite 512GB varient price : 512GB స్టోరేజీ, 48MP కెమెరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా ?

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లీడింగ్ బ్రాండ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ గత నెల్లోనే భారత్‌లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌కి అదనంగా ఇదే మోడల్లో ఇండియాలో మరో కొత్త వేరియెంట్ లాంచ్ అయింది. 512GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌లోనూ 8జీబీ ర్యామ్ ఉంటుంది. అయితే, పాత వేరియెంట్‌కి, కొత్త వేరియెంట్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే.. కొత్త ఫోన్‌లో 512GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉండటం. ఇదే కాకుండా 1TB వరకు మెమొరీని పెంచుకునేందుకు వీలుగా ఓ మైక్రో ఎస్‌డి కార్డు స్లాట్ సైతం శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ సొంతం. ఇక డిజైన్ విషయానికొస్తే.. రెండు వేరియెంట్స్ ఒకే రకమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్:
డ్యూయల్ సిమ్( నానో సిమ్ టెక్నాలజీ) శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 UI 2.0 వెర్షన్ ఆధారంగా పనిచేస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD + (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ అమోల్డ్ ప్లస్ ఇనిఫినిటీ-ఓ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌‌లను అనుసంధానం చేస్తూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 855 ఆక్టా-కోర్ ఎస్ఓసి చిప్‌ని అమర్చారు.  

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతలు:
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌‌కి ఉన్న చెప్పుకోదగిన ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఫోటోలో చూపించిన విధంగా పై నుంచి కిందకు వరుసగా మూడు హై పిక్సెల్ కెమెరాలు కలిగి ఉండటం. అందులో ఒకటి 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ( 48-megapixel camera ) కాగా మరొకటి 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ( 12-megapixel ultra-wide-angle camera ) మరొకటి 5మెగా పిక్సెల్ మాక్రో కెమెరా. అన్నింటికి మించి సెల్ఫీ ఫోటోలు, వీడియోలను మరింత అందంగా బంధించేందుకు వీలుగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ( 32-megapixel selfie camera ) ఉండటం మరో విశేషం. 186 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫీచర్స్ అన్నింటికీ అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఎక్కువ సమయం బ్యాటరీ నిల్వ ఉండేలా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ( 4,500mAh battery)ని అమర్చారు. 

ఇదివరకే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ 8GB RAM + 128GB వేరియెంట్ స్మార్ట్ ఫోన్‌కి ధర రూ.39,999 కాగా కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ 8GB RAM + 512GB వేరియెంట్ మోడల్ ధరను రూ.44,999 గా నిర్ణయించారు. అంటే.. 512GB వేరియెంట్ మోడల్‌ను మరో రూ.5,000 అధిక ధరకు విక్రయిస్తున్నారన్నమాట. అయితే, వినియోగదారులు తమ పాత ఫోన్‌ని తీసుకొస్తే... ఎక్స్‌చేంజ్ ఆఫర్‌పై రూ.5,000 డిస్కోంట్ అందించనున్నట్టు ఈ దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం పేర్కొంది. 

మార్చి 1 నుంచి విక్రయాలు:
మార్చి 1 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. రీటేల్ స్టోర్లు, శాంసంగ్ ఒపెరా హౌజ్, శాంసంగ్ ఇ-షాప్‌తో పాటు అన్ని లీడింగ్ ఆన్‌లైన్ సేల్స్ వెబ్‌పోర్టల్స్‌లో లభించనున్నాయి. ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ కలర్లలో గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్స్‌ని రూపొందించినట్టు శాంసంగ్ స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News