Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 242 మంది భారతీయులను మంగళవారం రాత్రి ఢిల్లీలోని విమానాశ్రయానికి చేర్చింది. యుద్ధ వాతావరణం నుంచి బయటపడడం తమకు ఎంతో ఆనందంగా ఉందని స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులు చెబుతున్నారు.
DGCA Suspends Scheduled International Passenger Flights: అంతర్జాతీయంగా షెడ్యూల్ షెడ్యూల్ చేసిన విమానాలను కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కేస్-టు-కేస్ ప్రాతిపదికన అనుమతించనున్నామని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్‌కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ మిషన్ ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి ఎయిరిండియా విమానాల రాకపోకల (Hong Kong Bans Air India's Vande Bharat Mission flights)ను హాంకాంగ్ నిషేధించింది.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దు కొనసాగుతోంది. తాజాగా జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు గడువును పొడగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది.
International Flights: భారత్‌లో కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నివారణ దిశగా సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రద్దు గడువును జూలై 15 వరకు పొడిగిస్తున్నట్టు డీజీసీఏ స్పష్టంచేసింది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగిరావాలని భావించి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట భారత్‌కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా 163 మందితో కువైట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ( Kuwait to Hyderabad special flight ) శనివారం రాత్రి హైదరాబాద్‌కి చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.