Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్‌లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Fake Seeds Alert Farmers : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.
Bandi Sanjay's Bail: బండి సంజయ్ బెయిల్ పై బయట ఉంటే, టెన్త్ పేపర్ లీకేజీ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
Warangal Police Notice To Ys Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు బ్రేక్ వేశారు. పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో న్యాయపరంగా వివరణ ఇచ్చేందుకు ఒక రోజు పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన 9 మంది హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శవాలు ఓ పాడుబడ్డ బావిలో దొరికిన ఘటన దేశమంతా కలకలం రేపింది. చనిపోయిన తొమ్మిది మందితో పాటు.. వారిని చంపిన నిందితుడు సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతదేహాలు బావిలో దొరకడంతో పోలీసులు ముందుగా ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటారని భావించారు. కానీ ఈ ఘటనలో కీలకంగా పని చేసిన సిసి ఫుటేజ్ ఆత్మహత్య కాదు... హత్య అని తేల్చింది.
లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు లేకపోవడంతో.. మద్యాన్ని బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో పోలీసు వేషం వేసిన ఇద్దరు కేడీగాళ్లు ఆఖరికి ఆ పోలీసులకే చిక్కి కటాకటాలు లెక్కిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
రమ్యను ప్రేమిస్తున్నానని నమ్మించిన సాయికుమార్ గౌడ్.. పుట్టిన రోజున తనను కలవాల్సిందిగా కోరాడు. సాయికుమార్ గౌడ్ మాటలు నమ్మిన రమ్య.. భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అలా రమ్యను ఒంటరిగా కాజీపేటకు రప్పించుకున్న సాయికుమార్.. ఆమెను తన కారులో ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
పుట్టిన రోజున గుడికి వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఓ యువతిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారనే ఘటన వరంగల్‌లో కలకలంరేపింది.
ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఇంకా సద్దుమణగకముందే తాజాగా వరంగల్‌లో చోటుచేసుకున్న మరో ఘటన ఇంటర్ బోర్డుని మరోసారి విమర్శలపాలుచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.