Air Cooler Price Down: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్‌ ఆఫర్‌..క్రాంప్టన్ 40 లీటర్ల కూలర్‌ను కేవలం సగం ధరకే పొందడి!

Crompton 40 Litre Room Air Cooler Price Down: అతి తక్కువ ధరతో ఈ ఎండా కాలం కూలర్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని క్రాంప్టన్ 40 లీటర్ల (Crompton 40 Litre Room) కూలర్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2024, 02:32 PM IST
Air Cooler Price Down: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్‌ ఆఫర్‌..క్రాంప్టన్ 40 లీటర్ల కూలర్‌ను కేవలం సగం ధరకే పొందడి!

Crompton 40 Litre Room Air Cooler Price Down: భారతదేశ వ్యాప్తంగా ఎండా కాలం ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌ దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలకు సంబంధించిన కూలర్స్‌పై ప్రత్యేక డీల్స్ ప్రారంభించింది. ఈ డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే కూలర్స్‌ లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన క్రాంప్టన్ 40 లీటర్ల కూలర్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అలాగే ఈ దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ కూలర్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో దీనికి సంబంధించి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ క్రాంప్టన్ 40 లీటర్ల (Crompton 40 Litre Room) కూలర్‌ కేవలం ఒక్క వేరియంట్, రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.9,500 కాగా సమ్మర్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,199కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా  అంతేకాకుండా దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. ఇక ఈ కూలర్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

దీంతో పాటు మీరు ఐసీఐసీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.5,500లోపు పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం మీరు మీ ఇంట్లో వినియోగిస్తున్న పాత కూలర్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 300 వరకు తగ్గింపు లభిస్తుంది. 

క్రాంప్టన్ 40 లీటర్ల కూలర్ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..కంపెనీ దీనిని రెండు వేరియంట్స్‌లో అందిస్తోంది. ఇందులో మొదటి వేరియంట్‌ రూమ్‌ ఎయిర్‌ కూలర్‌ అయితే.. రెండవది పర్సనల్‌ కూలర్‌. అంతేకాకుండా ఈ రెండింలో చల్లదనం కోసం ఐస్ బాక్స్ (Ice Box) ఫీచర్స్‌ను అందిస్తోంది. దీంతో పాటు 3 స్పీడ్‌ ఫ్యాన్ సెట్టింగ్‌లను కూడా అందిస్తోంది. అలాగే వాటర్ లెవల్ ఇండికేటర్ (Water Level Indicator) కూడా లభిస్తోంది. ఇది 40 లీటర్లు (40 Litres) సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఫీచర్లు:

40 లీటర్ల వాటర్ ట్యాంక్: చల్లని గాలిని ఎక్కువ సమయం పాటు అందించడానికి పెద్ద వాటర్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది.
కూలింగ్ ప్యాడ్స్:  మెరుగైన చల్లదనం కోసం ప్రీమియం కూలింగ్‌ ప్యాడ్స్‌ను అందిస్తోంది.
3 స్పీడ్ కంట్రోల్: మీకు కావలసిన గాలిని పొందడానికి మూడు స్పీడ్‌ సెట్టింగ్స్‌తో లభిస్తోంది. 
 స్వింగ్: గది అంతటా చల్లని గాలిని సమానంగా పంపిణీ చేసేందుకు ప్రీమియం స్వింగ్ మోడ్‌తో అందుబాటులో ఉంది.
కాస్టర్ వీల్స్: ఎక్కడికంటే అక్కడికి తీసుకుళ్లేందుకు కాస్టర్ చక్రాలు కూడా ఉన్నాయి.
ఐస్ ఛాంబర్: అదనపు చల్లదనం కోసం ఐస్‌ ఛాంబర్‌ కూడా లభిస్తోంది.

స్పెసిఫికేషన్లు:
వోల్టేజ్: 220-240V
ఎయిర్ డెలివరీ రేట్ (ADR): CMM 
నాయిస్ స్థాయి: నాయిస్‌ ఫ్రీగా లభిస్తోంది. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News