OnePlus: కళ్లు చెదిరే క్యూట్‌నెస్..అద్భుత ఫీచర్లతో వన్‌ప్లస్ 10ఆర్ ప్రైమ్ లాంచ్, ధర, ఫీచర్లు ఇలా

OnePlus: వన్‌ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధరే కాకుండా..క్యూట్‌గా ఆకర్షణీయంగా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభ్యమౌతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 22, 2022, 10:01 PM IST
OnePlus: కళ్లు చెదిరే క్యూట్‌నెస్..అద్భుత ఫీచర్లతో వన్‌ప్లస్ 10ఆర్ ప్రైమ్ లాంచ్, ధర, ఫీచర్లు ఇలా

OnePlus: వన్‌ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధరే కాకుండా..క్యూట్‌గా ఆకర్షణీయంగా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభ్యమౌతోంది.

OnePlus 10R Prime Blue Edition మరోసారి భారత మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే అద్భుత ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉంది. ఇందులో కొత్తగా ప్రైమ్ బ్లూ కలర్ ఆకట్టుకుంటోంది. అమెజాన్ సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే..అమెజాన్ ప్రైమ్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందనుంది. వన్‌ప్లస్ 10ఆర్ బ్లూ ఎడిషన్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

OnePlus 10R Prime Blue Edition సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ ధర 32,999 రూపాయలుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే..1750 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా పాత్ స్మార్ట్‌ఫోన్‌పై 15,200 రూపాయల ఎక్స్చైంజ్ ఆఫర్ ఉంది. 

OnePlus 10R Prime Blue Edition ఫీచర్లు

OnePlus 10R Prime Blue Editionలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఫ్లూయిండ్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రేర్ ట్రిపుల్ కెమేరాతో వస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్, 766 ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. కేవలం అరగంట వ్యవధిలో 1 నుంచి 100 శాతం ఛార్జ్ అయిపోతుంది. 

Also read: Online Shopping: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అత్యంత చౌకగా షాపింగ్, త్వరపడండి మరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News