Alert for Digital Transactions: ప్రస్తుత కాలంలో ఫోన్ పే,పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గరా చేతిలో రూపాయి ఉండడం లేదనడం లో సందేహం లేదు. ముఖ్యంగా ఈ డిజిటల్ పేమెంట్స్ చాలామందికి మంచి ఉపయోగాన్ని కలిగిస్తున్నాయి. క్షణాల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతోంది. ఎక్కడికైనా సరే.. చేతిలో డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకులో డబ్బు ఉండి చేతిలో మొబైల్ ఉంటే చాలు ఇట్టే ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు.
దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత డబ్బు దొంగతనం కూడా తక్కువయింది. కానీ కొంతమంది సైబర్ నేరగాళ్లు వీటిని టార్గెట్ చేసుకొని డబ్బు కాజేస్తున్నారు.. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారింటికి సిబిఐ రాబోతోందట. మరి ఆశ్చర్యంగా ఉంది కదూ.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
డిజిటల్ పేమెంట్స్ లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతోంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ఎలా రకరకాల యాప్స్ ని ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా యూపీఐ యాప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ మొత్తంలో యూపీఐ లాబాదేవీలు చేసే వారిపై ఆధారపు పన్ను విభాగం నిఘా పెడుతోందని సమాచారం. బ్యాంక్ అకౌంట్ లో పరిమితికి మించి నగదు జమ కావడం, ఎక్కువ మొత్తంలో విత్డ్రా చేసుకున్నా సరే ఆదాయపు పన్ను దేశాధికారులు నిఘా పెడుతున్నారట. అంతేకాదు ఇలాంటి వారికి ఇన్కమ్ టాక్స్ నోటీసులు పంపించే అవకాశం ఉందని సమాచారం.
దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.సాధారణంగా సేవింగ్స్ అకౌంటులో ఒక ఏడాది రూ .10లక్షల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటితే మాత్రం వెంటనే వివరాలు ఇన్కమ్ టాక్స్ విభాగానికి వెళ్ళిపోతాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లో సెక్షన్ 285 బిఏ కింద బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడానికి పరిమితి ఉంటుంది. అలాగే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా ఈ సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోలేక పోతే మాత్రం ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుందని సమాచారం.
Also Read: Daaku Maharaaj: డాకూ మహారాజ్ గా బాలయ్య.. గండ్ర గొడ్డలి పట్టిన యమ ధర్మరాజుగా నందమూరి హీరో..
Also Read: Gaddar: విప్లవ కవి గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ నెల 29న విడుదల..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter