Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసా

Flipkart Goat Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు తీసుకొస్తోంది. ఓ వైపు అమెజాన్, మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు రేపట్నించి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఫ్లిప్ కార్ట్ మెగా డీల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ లో రేపట్నించి లభించనున్న మెగా డీల్స్ ఇవే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2024, 07:42 AM IST
Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసా

Flipkart Goat Sale Offers: దిగ్గజ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ప్రైమ్ డే పేరుతో జూలై 20, 21 తేదీల్లో రెండ్రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అటు ఫ్లిప్ కార్ట్ రేపట్నించి ఐదు రోజులపాటు గోట్ సేల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో రేపట్నించి లభించే మెగా ఆఫర్లు ఇలా ఉన్నాయి. కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో రానున్నాయి. ఫ్లిప్ కార్ట్ డీల్స్ మీ కోసం..

ఈ కామర్స్ వేదికలు ఏదో ఒక పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తూ, అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు తరచూ ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ రేపట్నించి అంటే జూలై 19 నుంచి 23 వరకూ ఐదురోజులపాటు గోట్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు అందించనుంది. దాదాపు ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ కచ్చితంగా పొందవచ్చంటోంది ఫ్లిప్ కార్ట్. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నాయి. ఈ సందర్భంగా మీ కిష్టమైన బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, గృహోపకరణాలు ఇలా దాదాపు అన్నింటిపై ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ నుంచి గూగుల్ పిక్సెల్ వరకూ అన్ని స్మార్ట్ ఫోన్లపై రేపట్నించి ఐదురోజులు ప్రత్యేక తగ్గింపు లభించనుంది. ఆ డీల్స్ ఓసారి చూద్దాం

ఐఫోన్ 14 ప్లస్

6.7 ఇంచెస్ ఐఫోన్ ప్లస్ ప్రస్తుత ధర 55,999 రూపాయలు. వివిధ బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో 53,999 రూపాయలకు లబించనుంది. ఇది కాకుండా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్ ఫోన్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. 

గూగుల్ పిక్సెల్ 8

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ గూగుల్ లేటెస్ట్ మోడల్ గూగుల్ పిక్సెల్ 8పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అసలు ధర 61,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో కేవలం 47,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. వివిధ బ్యాంక్ ఆఫర్లతో 4 వేల డిస్కౌంట్, కొన్ని సెలెక్టెడ్ పోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా మరో 4000 డిస్కౌంట్ పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో మోడల్ పై కూడా తగ్గింపు ధర అందుబాటులో ఉంది. మార్కెట్ ధర 55,999 రూపాయలు కాగా 50,999 రూపాయలకు లభించనుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ మార్కెట్ ధర 29,999 రూపాయల్నించి అందుబాటులో ఉంటే ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో భాగంగా 28 వేలు లేదా అంతకంటే తక్కువకే లభించనుంది. వివిధ బ్యాంకు ఆఫర్లతో 2 వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉండగా ఎంపిక చేసిన మోడల్ ఫోన్లపై ఎక్స్చైంజ్ బోనస్ కింద మరో 2 వేలు తగ్గనుంది. 

నథింగ్ ఫోన్ 2

ఇక Flipkart goat sale లో నథింగ్ ఫోన్ 2పై అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. మార్కెట్ ధర 33,999 రూపాయలు కాగా ప్రత్యేక ఆఫర్ లో భాగంగా 28,999 రూపాయలకు లభించనుంది. వివిధ బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో 3 వేల రూపాయలు మినహాయిస్తే కేవలం 19,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

Also read: BMW CE 04 EV Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News