Gemini AI App: గూగుల్ జెమిని AI యాప్.. చిటికెలో మీ పనులు పూర్తి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Gemini AI App in India: జెమిని ఏఐ యాప్‌ను భారత్‌లో గూగుల్ ప్రారంభించింది. ఈ యాప్ ఇంగ్లీష్‌తోపాటు తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కు అందుబాటులో ఉండగా.. iOSలో త్వరలో అందుబాటులోకి రానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2024, 01:49 PM IST
Gemini AI App: గూగుల్ జెమిని AI యాప్.. చిటికెలో మీ పనులు పూర్తి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Gemini AI App in India: సరికొత్త యాప్‌ను గూగుల్ ప్రారంభించింది. జెనరేటివ్ AI చాట్‌బాట్ జెమిని మొబైల్ యాప్‌ను ఇంగ్లీష్‌తోపాటు తొమ్మిది ప్రాంతీయ భాషలలో లాంచ్ చేసింది. విద్యార్థుల నుంచి డెవలపర్‌ల వరకు, అనేక ఇతర ఆసక్తిగల వారు, ప్రజలు రోజువారీ జీవితంలో వారి ఉత్పాదకత, ప్రాక్టీస్, సృజనాత్మకతను మెరుగుపరచడానికి జెమిని ఏఐ సహాయపడనుంది. జెమినీ యాప్, జెమినీ అడ్వాన్స్‌డ్ రెండూ ఇప్పుడు 9 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయని గూగుల్ వెల్లడించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ 9 భాషలను జెమిని అడ్వాన్స్‌డ్‌కు అనుసంధినిస్తుంది. ఎక్కువ మందికి తమ భాషలో సమాచారాన్ని యాక్సెస్ చేయడంతోపాటు పనులను పూర్తి చేయడంలో సహాయపడతాయి. 

Also Read: Tollywood Senior Top Stars: టాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా తెలుసా..

"మేము జెమిని అడ్వాన్స్‌డ్‌లో కొత్త డేటా విశ్లేషణ సామర్థ్యాలు, ఫైల్ అప్‌లోడ్‌ల వంటి కొత్త ఫీచర్‌లను అన్‌లాక్ చేస్తున్నాము. ఇంగ్లీష్‌లో ప్రారంభించి గూగుల్ సందేశాలలో జెమినితో చాట్ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రారంభిస్తున్నాము. జెమిని యాప్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంది. మీరు ఏదైనా ప్లాన్ చేయాలన్నా.. ఏదైనా వంట రెసిపీని తయారుచేయాలన్నా.. లేదా సోషల్ మీడియా క్యాప్షన్‌ని రూపొందించాలన్నా మీకు జెమిని యాప్ సహరిస్తుంది.

మీకు అవసరమైన సహాయాన్ని అందిచేందుకు టైప్ చేయడానికి, మాట్లాడడానికి లేదా ఫొటోను యాడ్ చేసేందుకు ఈ యాప్ పర్మిషన్ ఇస్తుంది. ఫ్లాట్ టైర్‌ని ఎలా మార్చాలనే సూచనల కోసం దాని ఫోటోను యాడ్ చేయండి. మల్టీమోడల్, సహాయక AI అసిస్టెంట్‌ను రూపొందించడానికి మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది." అని గూగుల్ వెల్లడించింది. ఈ యాప్‌ను భారత్‌తో పాటు టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాల్లో కూడా గూగుల్ లాంచ్ చేసింది.

జెమిని యాప్ అండ్రాయిడ్‌లో అందుబాటులో ఉండగా.. iOSలో త్వరలో అందుబాటులోకి రానుంది. 1,500 పేజీల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. 100 ఈమెయిల్‌లను స్వీకరించవచ్చు. స్ప్రెడ్‌షీట్‌లు (Google షీట్‌లు, CSVలు, Excel) అప్‌లోడ్ చేసి.. సంక్లిష్ట డేటా విశ్లేషణ చేసుకోవచ్చు. జెమిని అడ్వాన్స్‌డ్ ఇప్పుడు డేటాను క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా పూర్తి డేటాను అన్వేషించి విశ్లేషిస్తుంది. డేటాను ఇంటరాక్టివ్ చార్ట్‌లు, గ్రాఫ్‌లుగా కూడా డిజైన్ చేస్తుంది. మీ ఖర్చులలో లేదా మీ చిన్న వ్యాపారం  సగటు మొత్తం అమ్మకాలలో నమూనాలను గుర్తించేందుకు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. జెమిని అడ్వాన్స్‌డ్‌ను మీ వ్యక్తిగత డేటా విశ్లేషకుడిగా పనిచేస్తుంది. జెమిని మీ ఫైల్‌లను ప్రైవేట్‌గా ఉంచుతుంది. 

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News