Tollywood Senior Top Stars: టాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా తెలుసా..

Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 10:42 AM IST
Tollywood Senior Top Stars: టాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా తెలుసా..

Tollywood Senior Actors: అవును చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కలిసి నటించలేదు. వీళ్లు కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. అప్పట్లో బాలయ్య, నాగ్ లు ‘గుండమ్మ కథ’ రీమేక్ చేయాలనున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అప్పట్లో చిన్ని కృష్ణ అందించిన కథతో కే.రాఘవేంద్రరావు తన 100వ చిత్రంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో ‘త్రివేణి సంగమం’ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది సెట్స్ పైకి వెళ్లకముందే ఆ ప్రాజెక్ట్ కు ప్యాకప్ చెప్పేసారు. కానీ ఈ నలుగురు హీరోలు ఓ సినిమాలోని ఓ పాటలో అతిథులుగా కలిసి నటించడం విశేషం.

వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ‘త్రిమూర్తులు’ సినిమాలో ఈ నలుగురు ఓ పాటలో అలా కనిపించి అలరించారు. త్రిమూర్తులు మూవీలో వెంకటేష్ పై చిత్రీకరించిన ‘ఒకే మాట ఒకే బాట’ పాటలో వెంకటేష్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కలిసి ఈ పాటలో కనిపించారు. ఈ పాటలో చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులు కూడా కనిపించి అభిమానులను కనువిందు చేసారు.  అంతేకాదు ఈ సాంగ్ లో రాధా, విజయశాంతి, భానుప్రియ, శారద వంటి తారామణులు కూడా మెరిసారు.

త్రిమూర్తులు సినిమా విషయానికొస్తే.. హిందీలో అమితాబ్ బచ్చన్, శతృఘన్ సిన్హా , రిషి కపూర్ లు హీరోలుగా మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో ‘నజీబ్’ సినిమాకు రీమేక్. అందులో కూడా అమితాబ్ .. నటించిన జాన్ జానీ జనార్దన్ అనే పాటలో కూడా అప్పటి హిందీ అగ్ర తారలైన రాజ్ కపూర్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర వంటి నటులు కూడా నటించడం విశేషం. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినపుడు.. హిందీలో తారలతో తెరకెక్కించిన పాటను తెలుగులో అప్పటి అగ్ర హీరోలందరిపై పిక్చరైజ్ చేయడం విశేషం. ఈ నలుగురు హీరోల అభిమానులకు మాత్రం ఇది తీపి గుర్తు. ఒక చిరు, నాగార్జున ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా.. స్టైల్ సినిమాలో వీళ్లిద్దరు అతిథి పాత్రల్లో మెరిసారు. అటు నాగ చైతన్య ‘ప్రేమమ్’ మూవీలో నాగార్జున, వెంకటేష్ ఇద్దరు కలిసి నటించారు. ఇద్దరు కలిసి ఉన్న సీన్స్ లేవు. ఏది ఏమైనా ఈ నలుగురు హీరోలు ఇపుడైనా.. ఏదైనా సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News