Infinix Note 40: BMW సంస్థ ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!

Infinix Note 40 Series Racing Edition: ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయిన Infinix Note 40 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ రేసింగ్‌ ఎడిషన్‌లో లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2024, 12:36 PM IST
Infinix Note 40: BMW సంస్థ ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు!

Infinix Note 40 Series Racing Edition: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌(Infinix) తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అద్భుతమైన డిజైన్‌తో Infinix నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ BMW గ్రూప్ డిజైన్‌వర్క్స్ సహకారంతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ రేసింగ్ ఎడిషన్ అద్భుతమైన డిజైన్‌తో రాబోతోంది. దీంతో పాటు ఇది  సిల్వర్ కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

infinix నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ ఉండే తేడాలు?:
ఈ ఎడిషన్‌ అద్భుతమైన కెమెరా లెన్స్‌ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ఐకానిక్ ట్రై-కలర్ రేసింగ్ లోగో సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ప్రత్యేకమైన వాల్‌పేపర్‌ ఫీచర్స్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ UI ఎలిమెంట్‌లతో రాబోతోంది. దీని బ్యాక్‌ ఫ్యానెల్ అధునాతన UV ప్రింటింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీని వెనకలో స్ట్రీమ్‌లైన్డ్ లైన్‌ కూడా వస్తోంది. ఇవే కాకుండా అనేక తేడాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. 

ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐదు మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్‌లో నోట్ 40, నోట్ 40 5 జి, నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో 5జితో పాటు నోట్ 40 ప్రో + 5G స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఈ మోడల్స్‌ కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 100W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే, ఇది సుమారు రూ. 17,400 నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్‌ మోడల్‌ Infinix Note 40 Pro+5G రేసింగ్ ఎడిషన్ ప్రారంభ ధర  రూ. 27,400లతో లభిస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
120 Hz AMOLED డిస్‌ప్లే
108 మెగాపిక్సెల్ కెమెరా
100W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్
MagCharge వైర్‌లెస్ ఛార్జింగ్
Active Halo AI లైటింగ్
JBL సౌండ్ సపోర్ట్‌
ఆండ్రాయిడ్ 14

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News