Iphone 15 Price Leaked: లీకైన Iphone 15 సిరీస్‌ ధరలు, డెడ్‌ ఛీప్‌ ధరలతోనే విడుదల..

Iphone 15 Price Leaked: యాపిల్ కంపెనీ త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయబోయే యాపిల్‌ 15 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫోన్లకు సంబంధించిన ధరలు లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా ఇటీవలే కొన్ని ఫీచర్లు లీక్‌ అయిన సంఘతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 28, 2023, 02:43 PM IST
Iphone 15 Price Leaked: లీకైన Iphone 15 సిరీస్‌ ధరలు, డెడ్‌ ఛీప్‌ ధరలతోనే విడుదల..

Iphone 15 Price Leaked: ప్రముఖ టెక్‌ కంపెనీ త్వరలోనే యాపిల్‌ 15 సిరీస్‌ను విడుదల చేయబోతోంది. వీలైనంత త్వరగా ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే యాపిల్‌ లవర్స్‌ ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ధర కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ టెక్‌ విశ్లేషకుడు బార్క్లేస్ సరఫరా సంబంధించిన కో కంపెనీలతో మాట్లాడి యాపిల్‌ 15 సిరీస్‌ ధర ఎంతో ఖరీదైనగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఓ టిప్‌ స్టర్‌ యాపిల్‌ 15 సిరీస్‌కు సంబంధించిన ధరను వెల్లడించారు. ఈ ధరను ఎంత వరకు నమ్మవచ్చో, టెక్‌ నిపుణులు ఏం అంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్‌ 15 ధర లీక్‌ అయ్యింది.  ఐఫోన్ 15 స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు $799 (దాదాపు రూ. 79,900) ఉంటుంది. అంతేకాకుండా యాపిల్ 15 ప్లస్‌ ధర సుమారు $ 899 (సుమారు రూ. 89,900) ఉండవచ్చని టిప్‌స్టర్‌ తెలిపారు. అయితే మార్కెట్‌లోకి ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలైన తర్వాత ధరలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డిమాండ్‌ పెరిగితే ధరలు కూడా కంపెనీ పెంచే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

యాపిల్‌ ప్రో మోడల్స్‌పై భారీగా పెంపు:
యాపిల్‌ ప్రో మోడల్స్ ధరల విషయానికొస్తే, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ ధరలను కంపెనీ అత్యధిక ధరలతో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. .ఐఫోన్ 15 ప్రో ధర రూ. 90,000లకు పైగానే ఉండొచ్చని ప్రముఖ టిప్‌స్టర్స్‌ అంటున్నారు. భారత మార్కెట్‌లో యూయస్‌ మార్కెట్‌లో రూ. 24,675 కంటే ఎక్కువ ధరతో ప్రో మోడల్స్‌ను యాపిల్‌ కంపెనీ విక్రయించబోతోందని సమాచారం. గత సంవత్సరం iPhone 14 Pro మోడల్స్‌ను కూడా కంపెనీ ఇలాగే విక్రయించిందని..అమెరికా మార్కెట్‌ యాపిల్ 14 ప్రో ధర రూ. 99,900 ఉంటే రూ. 129,900 ధరకు అమ్మకాలు జరిపింది. అయితే యాపిల్‌ iPhone 15 Proపై రూ. 10,000 వరకు పెంచుతూ విక్రయించబోతోందని లీక్‌ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. 

గత సంవత్సరంలో ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ను భారతదేశంలో రూ. 139,900 ధరతో విడుదల చేసిన సంగతి అందిరికీ తెలిసిందే..అయితే ధరల్లో తేడాలు రాకుండా.. అత్యంత ప్రీమియం కలిగిన యాపిల్‌ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను రూ. 1,06,845 లకు విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో  రూ. 20,000 వరకు పెంచుతూ ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావని చూస్తోంది. ఈ ధరలన్నీ కేవలం ఊహాగానాలేనని అధికారిక ధరల ప్రకటన కోసం వేచి చూడాల్సిందేనని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News