iPhone 17: స్లిమ్ బాడీతో శక్తివంతమైన iPhone 17 సిరీస్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ లీక్‌!

iPhone 17 Leaked: ప్రముఖ యాపిల్ కంపెనీ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేయబోయే ఐఫోన్ 17 సిరీస్ అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి రాబోతోంది ముఖ్యంగా ఈ సిరీస్ ను కంపెనీ 4 మోడల్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందులోని ఒక మోడల్ స్లిమ్ డిజైన్ తో కస్టమర్స్ కి పరిచయం చేయబోతోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 19, 2024, 12:06 PM IST
iPhone 17: స్లిమ్ బాడీతో శక్తివంతమైన iPhone 17 సిరీస్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ లీక్‌!

iPhone 17 Leaked: ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ ఇటీవలే నిర్వహించిన లేట్ లూట్ ఈవెంట్‌లో ఐప్యాడ్ ప్రోని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఐప్యాడ్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించడమే, కాకుండా సన్నని డిజైన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ అయ్యే యాపిల్ ఐఫోన్ సన్నీ మోడల్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతోంది. యాపిల్ కంపెనీ వచ్చే సంవత్సరం విడుదల చేయబోయే iPhone 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లను పూర్తిగా స్లిమ్ మోడల్ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో యాపిల్ విడుదల చేసిన 6a ఇలాంటి సన్నని డిజైన్తో త్వరలో రాబోయే యాపిల్ ఫోన్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2025 సంవత్సరంలో విడుదల కాబోయే 4 యాపిల్ స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన మోడల్స్ కంపెనీ తయారు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన వివరాలేంటో? స్లిమ్ డిజైన్‌లో తీసుకురావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా వచ్చిన మోడల్స్‌ని ఎలాగైతే మార్కెట్లోకి లాంచ్ చేసిందో ఐఫోన్ 17 సిరీస్‌లను లాంచ్ చేయబోతోంది. అంటే ఈ 17 సిరీస్‌ను కూడా నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. కానీ ఇందులో అనేక రకాల మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నాలుగు మోడల్స్ ను అద్భుతమైన డిజైన్‌తో పాటు స్లిమ్ బాడీతో తమ కస్టమర్‌కి అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీటి దర విషయానికొస్తే, ఈ యాపిల్ 15 సిరీస్ కంటే కాస్త ఖరీదు ఎక్కువైనని తెలుస్తోంది. యాపిల్ కంపెనీ ఇప్పటికే ఈ స్లిమ్ మోడల్ మొబైల్స్‌ను 2025 సంవత్సరంలో లాంచ్ చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకుందట. కంపెనీ ఈ సంవత్సరం మార్కెట్లోకి లాంచ్ చేయబోయే ఐ ఫోన్ 16 సిరీస్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ యాపిల్ కంపెనీ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేసే స్లిమ్ డిజైన్ యాపిల్ 17 సిరీస్ మొబైల్స్ అద్భుతమైన టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా కంపెనీ ఈ స్లిమ్ డిజైన్లు కేవలం ప్లస్ మోడల్‌లోనే అందుబాటులోకి తీసుకురానుంది. 

 iPhone 17 Pro Max ధర:
ఇక స్లిమ్ మోడల్ విషయానికొస్తే, iPhone 17 Pro Max కంటే ధర డబుల్‌గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి ధర సంబంధించిన విషయాలు మార్కెట్లో తెగ ప్రచారం అవుతున్నాయి. యాపిల్ కంపెనీ 2024 సంవత్సరం ఏడాది చివరిలోగా ఐప్యాడ్ ప్రోను కూడా కొత్త వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది కూడా ఎంతో స్లిమ్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 17 బ్యాక్ సైడ్ వివరాల్లోకి వెళితే.. ఇంతకుముందు మార్కెట్లోకి లాంచ్ అయిన యాపిల్ మొబైల్స్ కంటే ఇది ప్రత్యేకమైన లుక్కులో కనిపించబోతోంది. ఐఫోన్ 17 స్లిమ్‌లో సెంటర్-అలైన్డ్ రియర్ కెమెరా మాడ్యూల్, అల్యూమినియం బాడీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ పరిశీలిస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఐఫోన్ 17 స్లిమ్ ఫీచర్స్‌:
డైనమిక్ ఐస్లాండ్‌ ఫీచర్‌
6.6-అంగుళాల డిస్‌ప్లే
ఐఫోన్ 17 ప్రో 6.3 అంగుళాలు డిస్‌ప్లే
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9 అంగుళాలు డిస్‌ప్లే
24-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
A18/A19 చిప్
8GB ర్యామ్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News