Iqoo 12 5G: వీవో అనుబంధ చైనీస్ టెక్ బ్రాండ్ iQOO తమ మరో స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేయబోతోంది. iQOO 12 పేరుతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ మొబైల్ ఫోన్ అతి శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఐక్యూ కంపెనీ iQOO 11కి సక్సెసర్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన ప్రీ-బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ iQOO 12 మొబైల్‌కి సంబంధించిన ప్రీ-బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే..అయితే ఈ బుకింగ్ మొదలైన 9 గంటల్లోనే రికార్డులను బద్దలు కొట్టింది. స్టాక్ మొత్తం సేలై సంచలం సృష్టించింది. ప్రస్తుం ప్రీ బుకింగ్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌తో పాటు iQOO అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు కంపెనీ మైక్రోసైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అలాగే సాయంత్రం 5 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.
iQOO 12 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
iQOO 12 స్మార్ట్ ఫోన్ ప్రీమియం స్పెసిఫికేషన్స్ బిల్డ్ క్వాలిటీతో రాబోతోంది. ఈ మొబైల్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 3000నిట్‌ల గరిష్టమైన బ్రైట్‌నెస్‌తో పాటు HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్ Adreno 750 GPUని కలిగి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్ Android 14 ఆధారంగా FunTouchOS 14తో రాబోతున్నట్లు సమాచారం. కెమెరా ఫీచర్ల వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో అందుబాటులో రాబోతోంది. దీంతో పాటు 150 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 64MP టెలిఫోటో లెన్స్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ V3 ఇమేజింగ్ చిప్‌తో శక్తివంతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఈ మొబైల్ 16MP ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది.
ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్ 120W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh కెపాసిటీ బ్యాటరీ సపోర్ట్‌తో రాబోతోంది. దీంతో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతును కలిగి ఉంటుంది. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే.. శక్తివంతమైన HiFi ఆడియో స్పీకర్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 50,000లకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి