Iqoo 13 Launch Date: ప్రపంచ మార్కెట్లో ప్రముఖ చైనీస్ కంపెనీ ఐక్యూ తమదైన ముద్ర వేసుకుంది. ప్రీమియం ఫీచర్స్‌తోనే అతి తక్కువ ధరల్లోనే లాంచ్ కావడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐక్యూ కంపెనీ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ వస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి కంపెనీ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ మొదట చైనా విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ iQOO 13 పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది. ఇది అక్టోబర్ 30న లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది భారత్‌లో లాంచ్ అయితే ముందుగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో విడుదలయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పాపులర్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో విడుదల కానుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ల్పే 2K రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది BOE Q10 8T LTPO OLED డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో పాటు అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాక్ ప్యానెల్‌లోని కెమెరా సెటప్ చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చుట్టూ హాలో లైట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనికి తోడుగా డైనమిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
అలాగే ఇప్పటికే ఐకూ అధికారిక వెబ్సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా రన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని అక్టోబర్ 30న అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే దీనిని ముందుగా గ్లోబల్ మార్కెట్లో కాకుండా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటగా నాలుగు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. దీంతో పాట అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కూడా జంబో బ్యాటరీతో విడుదల చేయబోతోంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
Q10 8T LTPO OLED డిస్ప్లే
2K రిజల్యూషన్
144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
6150mAh పెద్ద బ్యాటరీ
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
50MP ప్రధాన కెమెరా
50MP అల్ట్రా వైడ్ కెమెరా
50MP టెలిఫోటో కెమెరా
32MP సెల్ఫీ కెమెరా
వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.