Iqoo 7 Neo: అద్భుతమైన ఫీచర్లతో Iqoo 7 Neo.. రేటు ఎంతంటే..??

Iqoo 7 Neo: బడ్జెట్‌ ధరల్లో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌లో Iqoo 7 Neo కూడా చాలా చౌకగా లభించనుంది. ఇది త్వరలో మార్కెట్‌లో లభించనుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 10:20 AM IST
Iqoo 7 Neo: అద్భుతమైన ఫీచర్లతో Iqoo 7 Neo.. రేటు ఎంతంటే..??

Iqoo 7 Neo: తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే తక్కువ ధరల్లో లభించే ఫోన్‌లలో iQOO Neo 7 5G ఒకటి. iQoo మొబైల్ ఫోన్ ఇటీవల మార్కెట్‌లోకి విడుదలై ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ రెడ్‌ మీ Note 12 Pro+, రెడ్‌ మీ 10 Pro+ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుంది. అయితే ఈ మొబైల్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్‌:
ప్రాసెసర్:

iQoo Neo 7 5G స్మార్ట్‌ఫోన్‌ టాస్కింగ్, స్పీడ్ 4nm ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో లభించనుంది. అంతేకాకుండా అధునాతన సాంకేతికతో LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో వచ్చింది.

ర్యామ్:
ఈ ఫోన్‌లో 8 జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీంతో మీరు 12 జీబీ ర్యామ్‌ను 20 జీబీకి పెంచుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ ఫోన్‌లో మోషన్ కంట్రోల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా గేమ్‌ అడుకునే క్రమంలో వేడిగా ఉండే ఫోన్‌ 3డి కూలింగ్ సిస్టమ్ ద్వారా కూల్‌గా అవుతుంది.

ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్:
iQoo Neo 7 5G ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కేవలం 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ నిండుతుంది. ఈ ఫీచర్‌తో మీరు సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.

భారతదేశంలో IQOO Neo 7 5G ధర:
మన మార్కెట్‌లో IQOO Neo 7 5G, 8 GB RAM / 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర  రూ. 29,999 ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇంకా తక్కువ ధరలకే లభించే అవకాశాలున్నాయి. కాబట్టి బడ్జెట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..ఇక 12 GB RAM / 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర విషయానికొస్తే.. రూ. 34,999 ఉండే ఛాన్స్‌ ఉంది..

Also read;  Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్

Also read; India post Recruitment: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీ, ఇవాళే ఆఖరు తేదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News