iQOO Neo 9 Pro: ఐక్యూ నుంచి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్.. పవర్ పుల్ ప్రోసెసర్, మతిపోగొట్టే కెమెరా..

iQOO Neo 9 Pro: ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఐక్యూ నియో9 ప్రో పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ ఫోన్ వన్ ప్లస్ 12ఆర్ కు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 08:06 AM IST
iQOO Neo 9 Pro: ఐక్యూ నుంచి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్.. పవర్ పుల్ ప్రోసెసర్, మతిపోగొట్టే కెమెరా..

iQOO Neo 9 Pro price leaked: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ అయిన ఐక్యూ నుంచి మరో కళ్లుచెదిరే స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఐక్యూ నియో9 ప్రో పేరుతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 22న మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీనికి సంబంధించిన ధర, ఫీచర్స్ లీక్ అయ్యాయి. 

గేమింగ్ ఆడేవారికి ఈ ఫోన్ మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఉండే క్యూ1 సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తోంది. ఇది క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 చిప్‌సెట్‌తో రాబోతుంది. ఇందులో మెయిన్ కెమెరా 50MP IMX 920 ప్రైమరీ సెన్సార్ తో రాబోతుంది. అంతేకాకుండా ఇది అప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఇది 5,150mAh బ్యాటరీ కెపాసిటీ... 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రాబోతుంది. 

దీని ధర ఐక్యూ 12 కంటే తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని లీక్స్ ను బట్టి అర్థమవుతోంది. 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 37,999గా ఉండబోతుంది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్ మూడు వేలు లభిస్తుండటంతో 34,999కి వచ్చే అవకాశం ఉంది. ఇది వన్ ప్లస్ 12ఆర్ మంచి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. దీని ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వెయ్యి రూపాయలు చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల రెండు సంవత్సరాల వారంటీ మరియు ఇతర లాంచ్ డే ఆఫర్‌లు వర్తిస్తాయి. 

Also Read: Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు..త్వరపడండి..

Also Read: Tata Nexon EV Offers: బంపర్ ఆఫర్ వచ్చేసింది.. నెక్సాన్ ఈవీ కార్లకు హెవీ డిమాండ్.. ధరలు తెలిస్తే క్యూ కట్టేస్తారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News