Iqoo Z7 5G Pro Price: 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Iqoo Z7 5G Pro మొబైల్‌..

Iqoo Z7 5G Pro Price In India: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ iQOO నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2023, 09:22 PM IST
Iqoo Z7 5G Pro Price:  256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Iqoo Z7 5G Pro మొబైల్‌..

Iqoo Z7 5G Pro Price In India: ప్రముఖ టెక్‌ కంపెనీ iQOO మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌గా తిరుగులేని పేరును పొందిన సంగతి తెలిసిందే..జనవరి నెలలో కస్టమర్లకు పరిచయం చేసిన iQOO Z7 సిరీస్‌ మొబైల్‌కి మంచి గుర్తింపు లభించడంతో కంపెనీ త్వరలోనే ఇదే సిరీస్‌తో మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ iQOO Z7 Pro 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించి స్పెసిఫికేషన్‌లను ట్విట్టర్‌లో ప్రముఖ టిప్‌ స్టార్‌ లీక్‌ చేశారు. ఈ మొబైల్‌ ఏయే ఫీచర్స్‌తో వస్తోందో, మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి రానుందో.. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

iQOO Z7 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ iQOO Z7 Pro స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన  సమాచారాన్ని ట్విట్‌ చేశాడు. ట్వీట్‌ వివరాల ప్రకారం..ఈ iQOO Z7 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ మేలో చైనా మార్కెట్‌లో విడుదల చేసిందని..ఇది Vivo S17e రీబ్రాండెడ్ మోడల్ డిజైన్‌ను కలిగి ఉందన్నారు. Z7 ప్రో 5G FHD+ రిజల్యూషన్‌లతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో  6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉందని సమాచారం. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoCని కలిగి ఉంటుందని ట్వీట్‌ ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్లు  AnTuTu బెంచ్‌మార్కింగ్ లిస్టింగ్‌లో కనిపించాయని సమాచారం. మొదట కంపెనీ ఈ మొబైల్‌ను 12GB ర్యామ్‌ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ మొబైల్‌ అత్యంత శక్తివంతమైన 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి 6W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా లభించనుంది. ఇక కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే..ఈ మొబైల్‌ బ్యాక్‌ సైడ్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఇక ఫ్రాంట్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు:
❃ బ్లూటూత్ 5.3
❃ Wi-Fi 6
❃ Android 13
❃ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్
❃ 6W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
❃ 4,600mAh బ్యాటరీ

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News