Lava Blaze Pro 5G Price: దేశీయ టెక్ కంపెనీ లావా త్వరలోనే తమ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. కంపెనీ Blaze Pro 5G పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధిరిక ప్రకటన కూడా కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. లావా మొబైల్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ స్మార్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలను కూడా వెల్లడించింది.
ఇక ఈ Lava Blaze Pro 5G మొబైల్ ధరకి సంబంధించిన ధరను మాత్రం కంపెనీ అధికారికంగా వివరించలేకపోయింది. కానీ టిప్‌స్టర్స్ అదించిన వివరాల ప్రకారం..ఈ మొబైల్ రూ.15,000లోపే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lava Blaze Pro 5G మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
Lava షేర్ చేసిన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కనెక్టివిటీ కోసం.. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, మైక్రోఫోన్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొబైల్ కింది భాగంలోని బెజెల్‌లో స్పీకర్ గ్రిల్‌ను అందించబోతోంది. అంతేకాకుండా డిస్‌ప్లే పంచ్-హోల్ పైన ఉన్న ఇయర్‌పీస్‌ను స్టీరియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. భద్రత కోసం లో సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు వెనక భాగంలో LED ఫ్లాష్‌తో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతోందని కంపెనీ తెలిపింది.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
ఇక ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో Lava లోగో బ్రాండింగ్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ MediaTek Dimension 6020 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం 5 కలర్స్‌లో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా 4GB+3GB RAM + 64GB ROM స్టోరేజ్ సమర్థ్యంలో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇక కెమెరా విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ AI కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇతర స్పెసిఫికేషన్‌లు:
5000mAh బ్యాటరీ
MediaTek Dimension 6020 చిప్‌సెట్
90Hz రిఫ్రెష్ రేట్
50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook