Moto G14, MOTOROLA e13: 5,000mAh బ్యాటరీతో Moto G14, MOTOROLA e13 మొబైల్స్‌ రూ.6,999లోపే పొందండి..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Moto G14, MOTOROLA e13: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని Moto G14, MOTOROLA e13 స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే దాదాపు 35 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 12:53 PM IST
Moto G14, MOTOROLA e13: 5,000mAh బ్యాటరీతో Moto G14, MOTOROLA e13 మొబైల్స్‌ రూ.6,999లోపే పొందండి..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Moto G14, MOTOROLA e13: పండగ సేల్స్‌ ముగిసిన తర్వాత కూడా కొన్ని స్మార్ట్ ఫోన్‌లపై ఈ కామర్స్‌ కంపెనీలు భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్‌ అతి చౌకగా లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఫ్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అతి తక్కువ ధరలోనే మంచి Motorola ప్రీమియం మొబైల్స్‌ కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లోని Moto G14, MOTOROLA e13 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు మొబైల్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ 36% వరకు డైరెక్ట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Moto G14, Moto E13పై భారీ తగ్గింపు:
ఫ్లిఫ్‌కార్ట్‌లో Moto G14 స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ MRP ధర రూ.12,999కు అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 34% తగ్గింపుతో రూ. 8,499కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 7,499కే పొందవచ్చు. 

ఈ ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA e13 స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం MRP ధర రూ. 10,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌ భాగంగా MRP ధరపై 36 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీంతో ఈ MOTOROLA e13 స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ.6,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి  కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Moto G14 స్పెసిఫికేషన్‌లు:
Moto G14 స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో రాబోతోంది. ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే ఈ మొబైల్‌ ఫోన్‌ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్, ఈ స్మార్ట్ ఫోన్‌ 4GB RAM + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. G14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  కెమెరా మాడ్యూల్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 8MP సెల్ఫీ కెమెరా,  5,000mAh బ్యాటరీతో పాటు 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. 

Moto G13 స్పెసిఫికేషన్‌లు:
ఈ Motorola స్మార్ట్‌ ఫోన్‌  6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేతో రాబోతోంది. Moto G13 మొబైల్‌ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G85 12nm ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  ఈ మొబైల్‌ 50MP వెనుక కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు  f/2.0 ఎపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News