Moto Razr 50 Foldable Phone Discount Offer: రోజు రోజుకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడబోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని టెక్ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola విడుదల చేసిన Motorola Razr 50 మొదటి సేల్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా 10 రోజుల నుంచి సాగుతోంది. దీనిని కంపెనీ రూ.50 వేల లోపు విక్రయిస్తోంది. అయితే ఈ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఫోల్డబుల్ విభాగంలో Motorola మిడిల్ బడ్జెట్‌లో విడుదల చేసిన మొబైల్స్‌లో Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది అద్భుతమైన AI ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ IPX8 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 4 లక్షలపైగా మడత పెట్టే ప్రత్యేకమైన ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌ను కూడా అందిస్తోంది.
మొదటి సేల్‌లో ఆఫర్స్:
ఈ Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదట ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా బేస్ వేరియంట్ (8GB ర్యామ్, 256GB స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ ధర రూ.64,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5000 కూపన్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.10,000 బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.49,999కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Motorola Razr 50 స్పెసిఫికేషన్స్:
6.9-అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్
3.6-అంగుళాల AMOLED డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ
MediaTek Dimensity 7300X ప్రాసెసర్
Android 14 ఆధారిత సాఫ్ట్‌వేర్
50MP ప్రధాన కెమెరా సెన్సార్
13MP అల్ట్రావైడ్ లెన్స్
32MP ఫ్రంట్ కెమెరా
4200mAh బ్యాటరీ సామర్థ్యం
30W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.