Motorola Razr 50 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola ఇటీవలే మార్కెట్‌లో లాంచ్ చేసిన Razr మోడల్‌కి మంచి గుర్తింపు లభించింది. అలాగే వీటి విక్రయాలు కూడా పెరగడంతో ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు యోచిస్తోంది. కంపెనీ Motorola Razr 50, Motorola Razr 50 Ultra పేర్లతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన విడుదల తేదిని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో కనిపించింది. అంతేకాకుండా కంపెనీ XT2453-1 మోడల్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన చైనీస్ వేరియంట్ ఇప్పుడు 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
3C లిస్టింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ XT-2453-2 మోడల్ నంబర్‌తో గ్లోబల్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్స్ 15W (5V/3A), 27W (9V/3A), 30W (12V/2.5A)తో పాటు 33W (11V/3A) ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే Motorola Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్ లాగా 33 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో లభించబోతోంది. ముఖ్యంగా కంపెనీ ఈ మొబైల్స్‌ను పీచ్ ఫడ్జ్, గ్రీన్‌తో పాటు బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.
డబుల్ కెమెరా సెటప్:
ఈ మోటరోలా కొత్త మొబైల్స్ 3.6 అంగుళాలు కవర్ డిస్ప్లేతో పాటు 6.9 అంగుళాలు మెయిన్ డిస్ల్పే సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు బ్యాక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో సెన్సార్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే ఇది, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో లభించబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Motorola G85 మొబైల్ కూడా లాంచ్ కాబోతోంది:
ప్రముఖ Motorola కంపెనీ G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని కంపెనీ Motorola G85 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది గత వారం యూరోపియన్ రిటైలర్ల వెబ్‌సైట్లలో దర్శనిమిచ్చింది. ఇది 'మాల్మో' అనే కోడింగ్‌తో తమ కస్టమర్స్‌కి లభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 ప్రాసెసర్‌తో లభించనుంది. దీనిని కంపెనీ 12 GB ర్యామ్‌తో లభించబోతోంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే ధర రూ. 27,200 నుంచి ప్రారంభం కాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి