OnePlus Nord 4 Price: ప్రముఖ వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ మొబైల్స్‌కి రోజు రోజు మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుత చాలా మంది ఎక్కువగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎప్పటి నుంచో మీకు కూడా మంచి వన్‌ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే వన్‌ప్లస్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. కంపెనీ OnePlus Nord 4, OnePlus Nord CE 4 Lite పేర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి రీబ్రాండెడ్ వెర్షన్‌గా OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రాబోయే స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది స్నాప్‌డ్రాగన్ 7+ J3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 12 GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 6.74 అంగుళాల డిస్‌ప్లే సెటప్‌తో వస్తోంది. ఈ మొబైల్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లేతో సెటప్‌తో గ్రరిష్టంగా 2150 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తారు. ఇక ఈ మొబైల్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే, దీనిలో కంపెనీ డబుల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో మరెన్నో అద్భుతమై ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గంతలో లాంచ్ అయిన Oppo A3 స్మార్ట్‌ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఇది అద్భుతమైన బయోమెట్రిక్ సెక్యూరీటి, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెటప్‌తో రాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి