Oneplus Open 2: తక్కువ ధరలోనే Oneplus నుంచి అదిపోయే ఫోల్డబుల్ ఫోన్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ ఇవే!

Oneplus Open 2 Price: మార్కెట్‌లోకి మరో కొత్త Oneplus ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్ వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 25, 2024, 02:44 PM IST
Oneplus Open 2: తక్కువ ధరలోనే Oneplus నుంచి అదిపోయే ఫోల్డబుల్ ఫోన్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ ఇవే!

 

Oneplus Open 2 Price: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ తమ కస్టమర్స్‌కి పెద్ద శభ వార్త తెలిపింది. గత సంవత్సరం లాంచ్‌ చేసిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా కొత్త వన్‌ప్లస్ ఓపెన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కొత్త లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా కంపెనీ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం చివరిలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ అనేక అప్‌గ్రేడ్‌లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి.
  
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన వివరాల ప్రకారం, ఈ వన్‌ప్లస్ ఓపెన్ 2ని స్మార్ట్‌ఫోన్‌ని ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదటి నెలలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది శాటీలైట్‌ టెక్నాలజీతో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ మొబైల్‌కి రీబ్రాండెడ్ వెర్షన్?
లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ OnePlus Open 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ Oppo Find N5 రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఫీచర్స్‌ పరంగా అనేక మార్పులు ఉండొచ్చని టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ బరువు ఒప్పో కంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ హై-రిజల్యూషన్ డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది ఒప్పో కంటే అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధర వివరాలు:
ఈ OnePlus Open 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే, 16GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ.1,39,999 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరో వేరియంట్‌కి సంబంధించిన ధర వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోల్డబుల్ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వన్‌ప్లస్‌ కంపెనీ త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News