Poco F6 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G గేమింగ్‌ మొబైల్‌ను కేవలం రూ.999కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాలు!

Poco F6 Price Cut: భారీ తగ్గింపుతో మంచి గేమింగ్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్ ఛీప్‌ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 2, 2024, 01:26 PM IST
Poco F6 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G గేమింగ్‌ మొబైల్‌ను కేవలం రూ.999కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాలు!

 

Poco F6 Price Cut: ఎప్పటి నుంచో మంచి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన అన్ని గేమింగ్‌ మొబైల్స్‌పై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రముఖ చైనీస్‌ కంపెనీ పోకోకు సంబంధించిన గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అలాగే కొన్ని మొబైల్స్‌ భారీ ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గతంలో లాంచ్‌ అయిన POCO F6 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం POCO F6 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.29,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 12 GB ర్యామ్‌,  512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రూ.33,999 ధరలో లభిస్తోంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ బేస్‌ వేరియంట్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ధర రూ.29,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 11 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనిని వినియోగించి బిల్‌ చెల్లించేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను మీకు ఇష్టమైన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిన్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన బ్యాంక్‌లపై కూడా క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ ఎక్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నవారు ముందుగా పాత మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కి ఎక్చేంజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు  రూ.29,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.3000 వరకు బోనస్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ POCO F6 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.999కే పొందవచ్చు. అలాగే ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.   

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News