Poco Pro Price: అమెజాన్‌లో POCO M6 5G మొబైల్‌పై రూ.9,400 డిస్కౌంట్.. షాక్‌ అవ్వకండి ఇలా కొనండి!

Poco Pro Price: అత్యంత తగ్గింపుతో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. POCO M6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులోనే ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 18, 2024, 04:40 PM IST
Poco Pro Price:  అమెజాన్‌లో POCO M6 5G మొబైల్‌పై రూ.9,400 డిస్కౌంట్.. షాక్‌ అవ్వకండి ఇలా కొనండి!

Poco Pro Price: అతి తక్కువ ధరలోని ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలామంది యువత ఎక్కువగా ఇలాంటి ఫోన్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన గేమింగ్ మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. గతంలో ప్రముఖ చైనీస్ కంపెనీ పోకో కూడా ఎమ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. 

గతంలో మార్కెట్లోకి విడుదలైన POCO M6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు ప్రత్యేకమైన కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మిడిల్ స్టోరేజ్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక దీనిపైనే అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీని అసలు ధర రూ.13,999 కాగా ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా 29% తగ్గింపుతో కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంది. 

ఈ POCO M6 5G స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించు కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ ను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.500 విలువచేసే ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తుంది. ఇక దీనిని వినియోగించు కొనుగోలు చేసే వారికి ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8,500కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.9,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.500కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ POCO M6 5G మొబైల్ పై అనేక రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ చిప్‌సెట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్
 6.79 అంగుళాల ఫుల్ HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
108MP ప్రైమరీ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్‌
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
5G కనెక్టివిటీ

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News