Realme Narzo 70 Pro 5G: లాంచింగ్‌కి ముందే Realme Narzo 70 Pro మొబైల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌..

Realme Narzo 70 Pro 5G Specifications: చైనీస్‌ కంపెనీ రియల్‌ మీ త్వరలోనే మార్కెట్‌లోకి Realme Narzo 70 Pro 5G మొబైల్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ అమెజాన్‌ అధికార వెబ్‌సైట్‌ ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 01:04 PM IST
Realme Narzo 70 Pro 5G: లాంచింగ్‌కి ముందే Realme Narzo 70 Pro మొబైల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌..

Realme Narzo 70 Pro 5G Expected Specifications And Launch Date: ప్రముఖ చైనీస్‌ టెక్‌ బ్రాండ్‌ రియల్‌మీ త్వరలో తమ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.  కొత్త నార్జో 70 ప్రో 5G మోడల్‌ను మార్చి మొదటి వారం లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌  గత సంవత్సరం రియల్‌ మీ ప్రవేశపెట్టిన Narzo 60 Pro 5Gకు సక్సెసర్‌గా లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ ఫ్లాట్ డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్‌తో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. అయితే ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే, ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Realme ఇటీవలే లాంచ్‌ చేసిన టీజర్‌లో భాగంగా ఈ Narzo 60 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ కుడి భాగంలో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో రౌండ్‌ కెమెరా సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ప్రధాన కెమెరాలో భాగంగా  1/1.56 అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ  స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో లాంచ్‌ చేయాలని యోచిస్తోంది. అలాగే ఇప్పటికే అమెజాన్ Narzo 70 Pro 5G మొబైల్‌ కోసం మైక్రో వెబ్‌పేజీని ప్రత్యేక్ష ప్రసారం చేస్తూ వస్తోంది.

ఈ Realme Narzo 60 Pro 5G మొబైల్‌ MediaTek డైమెన్సిటీ 7050 SoCని ప్రాసెసర్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్‌ 1,080 x 2,400 పిక్సెల్స్‌ను కలిగి ఉంటుంది. రీయల్ మీ ఈ దీనిని డ్యూయల్ కెమెరా సెటప్‌తో లాంచ్‌ చేసేందుకు యోచిస్తోంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెట్‌లో 100-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. అలాగే సెల్ఫీ కోసం.. 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే..5,000 mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. అలాగే ఈ మొబైల్‌ 67 W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

రియల్‌ మీ కంపెనీ ఈ  Realme Narzo 60 Pro 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు Realme 12+ 5G మొబైల్‌ను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలను కంపెనీ ఇంకా అధికారంగా వెల్లడించలేదు. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఫోటోస్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ లీక్‌ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా 6.7 అంగుళాల పూర్తి HD + AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News