Redmi 12 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G రూ.1,200లోపే పొందండి.. డిస్కౌంట్‌ వివరాలు!

Redmi 12 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 12, 2024, 12:38 PM IST
Redmi 12 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Redmi 12 5G రూ.1,200లోపే పొందండి.. డిస్కౌంట్‌ వివరాలు!

 

Redmi 12 5G Price Cut: ప్రస్తుతం మార్కెట్లో 128జీబీ స్టోరేజ్‌తో వస్తున్న కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ ఎక్కువగా ఇలాంటి మొబైల్స్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చాలామంది మిడిల్ క్లాస్ కస్టమర్స్ అయితే తక్కువ ధరలోనే లభించే ఎక్కువ స్టోరేజ్ కలిగిన మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని టెక్ కంపెనీలు అతి తక్కువ ధరల్లోని ఎక్కువ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా వీటిని కంపెనీలు ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు అతి తక్కువ ధరకు సేల్ చేస్తున్నాయి. ప్రముఖ చైనీస్ కంపెనీ రెడ్‌మీ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన అన్ని మొబైల్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదే..కాబట్టి ఈ కంపెనీ ఎప్పుడు ఎక్కువ స్టోరేజ్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను  మార్కెట్లోకి అతి తక్కువ ధరలోనే లాంచ్ చేస్తూ వస్తుంది. గతంలో ఈ రెడ్‌మీ కంపెనీ 12 సిరీస్‌లో లాంచ్ చేసిన 5జి స్మార్ట్ ఫోన్‌కి విశేష గుర్తింపు లభించింది. 

ప్రముఖ రెడ్‌మీ కంపెనీ అతి తక్కువ ధరలోని ఎక్కువ స్టోరేజ్‌తో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌లో Redmi 12 5G కూడా ఒకటి. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో ప్రీమియం కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంది. అందులో లైట్ బ్లూ కలర్ కలిగిన స్మార్ట్ ఫోన్ మంచి ప్రజాదరణ సంపాదించింది. ఇక ఈ మొబైల్ విషయానికొస్తే, కంపెనీ దీనిని రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ 128GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను ధర MRP రూ.17,999తో విక్రయిస్తోంది. 

కానీ ఫ్లిఫ్‌కార్ట్‌ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ను బిగ్ సేవింగ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే, దాదాపు 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.12,499కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపుతో పొందవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే, ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

దీంతోపాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది ఫ్లిఫ్‌కార్ట్‌. ఈ ఆఫర్ను వినియోగించడానికి, వినియోగంలో ఉన్న పాత మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌కి ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.11,635 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను Redmi 12 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.1,200లోపే పొందవచ్చు. ఇవే కాకుండా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో EMI ఆప్షన్ చూస్ చేసుకుని కొనుగోలు చేసే వారికి మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News