Redmi Note 14 Series Launch: రెడ్ మి నోట్ 14 సిరీస్‌కు చెందిన రెడ్ మి నోట్ 14 ప్రో, రెడ్ మి నోట్ 14 ప్రో ప్లస్‌తో పాటు రెడ్ మి స్మార్ట్‌వాచ్, ఇయర్ బడ్స్ కూడా విడుదల కానున్నాయి. జనవరి 10వ తేదీన ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. ఈ మేరకు రెడ్ మి కంపెనీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
రెడ్ మి నోట్ 14 సిరీస్‌కు చెందిన రెడ్ మిన నోట్ 14 ప్రో, రెడ్ మి నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు రెడ్ మి వాచ్ 5, రెడ్ మి బడ్స్ 6 ప్రో పేరుతో ఇయర్ బడ్స్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. జనవరి 10వ తేదీ లాంచ్ ఈవెంట్‌లోనే స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్,, షావోమీ 165 వాట్స్ పవర్ బ్యాంక్ రిలీజ్ కానున్నాయి. పవర్ బ్యాంక్ అయితే 10 వేల ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. రెడ్ మి నోట్ 14 సిరీస్‌లో ప్రత్యేకత ఏంటంటే ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజింగ్, ఫోటో ఎడిటింగ్ ఫీచర్లతో వస్తుంది. ఇక వాటర్, డస్ట్ ప్రొటెక్షన్‌కు సంబంధించి ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ పొటెక్షన్, యాంటీ ట్రాప్ ఆల్ స్టార్ ఆర్మర్‌తో వస్తోంది.
రెడ్ మి నోట్ 14 సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ ఉంటుంది. ఇందులోనే ప్రో మోడల్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా, ప్రో ప్లస్ మోడల్ అయితే స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటాయి. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్ మి నోట్ 14 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 18,999 రూపాయలుంటుంది. ఇక రెడ్ మి నోట్ 14 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ 24,999 రూపాయలుంటుంది. రెడ్ మి నోట్ 14 ప్రో ప్లస్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 30,999 రూపాయలుంటుంది.
Also read: APPSC Notifications: నిరుద్యోగులకు బంపర్ న్యూస్, 2,686 పోస్టుల భర్తీ, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.