Samsung Galaxy Buds 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ (Samsung) తమ కస్టమర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇటీవలే గెలాక్సీ అన్ప్యాక్డ్ 2024 ఈవెంట్లో భాగంగా సాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్స్తో పాటు అనేక టెక్ ఉత్పత్తులను లాంచ్ చేసింది. వీటన్నింటిని కంపెనీ డెడ్ చీప్ ధరల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా గతంలో కంపెనీ విడుదల చేసిన ఇయర్ బడ్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో మరో ముందడు వేసింది. దీంతో కంపెనీ Samsung Galaxy Buds 3తో పాటు Galaxy Buds 3 Pro ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. ఇది చూడడానికి యాపిల్ ఇయర్ బడ్స్‌లా కనిపించినప్పటికీ లోపల వచ్చే స్పీకర్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్‌ను గతంలో విడుదల చేసిన మోడల్స్ కంటే చాలా ఆప్డేట్లో రాబోతున్నాయి. అయితే ఈ కొత్త మోడల్స్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సాంసంగ్ Galaxy Buds 3, Galaxy Buds 3 Pro ఇయర్ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు కంపెనీ వీటికి IP57 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ఓపెన్-టైప్ డిజైన్ సెటప్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రో మోడల్ ఇన్-ఇయర్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులోని స్పీకర్స్ టూ-వే 10.5 ఎంఎం డైనమిక్ స్పీకర్ సెటప్‌లను కలిగి ఉంటుంది. ఈ రెండు మోడల్స్‌కి మూడు మైక్రోఫోన్ల సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏ వేదర్లోనైనా మాట్లాడేందుకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక ఈ స్మార్ట్ ఇయర్ బడ్స్ ధర వివరాల్లోకి వెళితే, ఈ సాంసంగ్ Galaxy Buds 3 ఇయర్ బడ్ ధర రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక బడ్స్ 3 ప్రో ధర రూ.19,999 నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ ఇయర్ బడ్స్‌ను కంపెనీ రెండు ( సిల్వర్, వైట్) కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేయబోతోంది. అలాగే సాంసంగ్ కంపెనీ ఈ రెండు మోడల్ ఇయర్ బడ్స్‌పై ప్రీ ఆర్డర్లు కూడా ప్రారంభించింది. అయితే కంపెనీ వీటి మొదటి సేల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇటీవలే చేసింది. ఈ ఇయర్ బడ్స్‌పై మొదటి సేల్ జూలై 24 నుంచి మొదలు కాబోతోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ
ఆటో-స్విచ్ ఫీచర్
IP55 రేటింగ్
AI ఆధారిత ఫీచర్స్
48mAh బ్యాటరీ
515mAh కేస్ బ్యాటరీ
30 గంటల బ్యాటరీ లైఫ్
24 గంటల బ్యాటరీ లైఫ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి