Sony Diwali Bonanza 2023: Sony నుంచి పిచ్చెక్కించే ఆఫర్స్‌..దీపావళి బొనాంజా సందర్భంగా వీటిపై 50 శాతం తగ్గింపు!

Sony Diwali Bonanza 2023: సోనీ కంపెనీ దీపావళి బొనాంజా సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 10:48 AM IST
Sony Diwali Bonanza 2023: Sony నుంచి పిచ్చెక్కించే ఆఫర్స్‌..దీపావళి బొనాంజా సందర్భంగా వీటిపై 50 శాతం తగ్గింపు!

 

Sony Diwali Bonanza 2023: దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ టెక్ కంపెనీ సోనీ పండుగ సేల్‌ను ప్రకటించింది. ఈ సోనీ దీపావళి బొనాంజా సేల్‌లో భాగంగా అన్ని రకాల సోనీ ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్ల్‌లను అందించబోతున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా ఆడియో, వీడియో పరికరాల నుంచి  కెమెరాల వరకు అన్నీ చౌకగా లభించనున్నాయి. సోనీ బ్రాండ్‌కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో ఓఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీలతో పాటు సౌండ్‌ బార్స్‌ అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.  

స్మార్ట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు: 
థియేటర్ లాంటి అనుభూతి పొందడానికి మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. సోనీ బ్రావియా ఎక్స్‌ఆర్ టీవీని ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 30% వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రూ. 25,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ ప్రీమియం మాస్టర్ సిరీస్ XR OLED 55A95L TV రూ. 87,900 వరకు తగ్గింపు పొందుతారు. 

సౌండ్‌బార్‌లపై ప్రత్యేక ఆఫర్‌:
ది బెస్ట్‌ ఫీచర్స్‌తో సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను సెటప్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ దీపావళి పండగ సేల్‌లో సోనీ అధికారిక వెబ్‌సైట్‌లో సౌండ్‌బార్‌లపై కాంబో డీల్‌ను అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో Bravia స్మార్ట్ టీవీతో 7.1.4ch HT-A9 లేదా HT-A7000 సౌండ్‌బార్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.65,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మీరు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడ పొందవచ్చు. 

ఇక ఈ సేల్‌లో బ్లూటూత్ స్పీకర్‌లను సోనీ కంపెనీ రూ.14,990కే అందిస్తోంది. ఈ సోనీ దీపావళి బొనాంజా సేల్‌లో SRS-XG300, SRS-XP700 మెగా బ్లూటూత్ స్పీకర్‌ మోడళ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌పై స్పెషల్ డీల్‌:
Sony బ్రాండ్‌కి సంబంధించిన WH-1000XM5, WH-XB910N, WH-CH720N, WH-CH520 మోడల్స్‌ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌లు సోనీ దీపావళి బొనాంజా సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై కంపెనీ అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ సేల్‌లో WF-C500 మోడల్‌ హెడ్‌ఫోన్‌ను రూ. 4,490 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు. 

కెమెరాతో యాక్సెసరీలు ఉచితం:
కొత్త కెమెరాను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో అతి తక్కువ ధరలోనే అన్ని సోని కంపెనీకి సంబంధించి కెమెరాలు లభిస్తున్నాయి. సోనీ ఆల్ఫా మిర్రర్‌లెస్ కెమెరాతో పాటు ఉచిత బ్యాటరీలు, ప్రో హెడ్‌ఫోన్‌లు, ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్‌లను ఉచితంగా అందిస్తోంది. కంపెనీ సోనీ జి మాస్టర్ గ్లాస్‌పై  రూ. 10,000 వరకు అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News