Tecno Spark 20 Pro 5G Price: రూ.13 వేలకే 108 కెమెరా, 5,000mAh బ్యాటరీ Tecno మొబైల్‌.. అమ్మకాల్లో దుమ్మురేపబోతోంది!

Tecno Spark 20 Pro 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించనున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2024, 12:07 PM IST
Tecno Spark 20 Pro 5G Price: రూ.13 వేలకే 108 కెమెరా, 5,000mAh బ్యాటరీ Tecno మొబైల్‌.. అమ్మకాల్లో దుమ్మురేపబోతోంది!

Tecno Spark 20 Pro 5G Price Cut: 108MP కెమెరాతో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌ అమెజాన్‌లో లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ అమెజాన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ప్రారంభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన కెమెరాతో పాటు ప్రీమియం ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్‌ ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌లో భాగంగా బంపర్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన ఈ Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.15,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఈ రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.16,999 నుంచి లభించనుంది. అయితే మొదటి సేల్‌లో భాగంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ పోను Tecno Spark 20 Pro 5G మొబైల్‌ను రూ.13,999లోపే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Tecno Spark 20 Pro 5G ఫీచర్స్‌ వివరాలు:
ఈ Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్ల్పే సెటప్‌తో లభిస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన  MediaTek Dimension 6080 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అలాగే Mali-G57 MC2 GPU సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14-ఆధారిత HiOS 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ సని చేస్తుంది. దీంతో పాటు సెప్టీలో భాగంగా కంపెనీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా 
1440p వీడియో రికార్డింగ్‌ ఫీచర్‌
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
33W వైర్డు ఛార్జింగ్ సొల్యూషన్‌
5,000mAh బ్యాటరీ
10W రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
WiFi 5, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీలు

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News