Vivo V30 Vs Vivo V30 Pro: లాంచ్‌ కాబోతున్న ఈ రెండు మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌!

Vivo V30 Vs Vivo V30 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న Vivo V30, Vivo V30 Pro స్మార్ట్ ఫోన్లకు లాంచింగ్‌కి ముందే మంచి పేరు లభించింతి. దీంతో చాలామంది ఈ మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ ఫీచర్ల పరంగా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2024, 07:58 AM IST
Vivo V30 Vs Vivo V30 Pro: లాంచ్‌ కాబోతున్న ఈ రెండు మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌!

 

Vivo V30 Vs Vivo V30 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన కెమెరాలతో స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అందుకే ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లకి మార్కెట్లో ఎంతగానో డిమాండ్ ఉంది. ముఖ్యంగా మార్కెట్లోకి విడుదల కాబోయే Vivo V30, Vivo V30 Pro  స్మార్ట్ ఫోన్ల విక్రయాల సంబంధించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ రెండు మొబైల్ ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. అందుకే యువత ఎక్కువగా ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంతమంది  ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో ఏది కొనుగోలు చేయాలని అనేకసార్లు ఆలోచిస్తున్నారు. వీటి రెండు మొబైల్స్‌ ధరలు ఇంచుమించు దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్ల పరంగా ఏది బెస్ట్.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెండు Vivo V30, Vivo V30 Pro స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళితే..V30 మొబైల్ 6.44 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అందుబాటులోకి రాబోతోంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా పరంగా చూస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లభించనుంది. ఇందులో మొదటిది 64MP కలిగి ఉంటుంది. అదనంగా, 8MP వైడ్, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలతో లభిస్తోంది. 

ఇక V30 Pro స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే.. ఇది 6.78-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ (మృదువైన స్క్రోలింగ్ కోసం) సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సెట్ అప్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ ని కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన + ZEISS లెన్స్ కెమెరా ఉండగా.. అదనంగా 50MP అల్ట్రా వైడ్, 12MP టెలీఫోటో లెన్స్ లను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ అతి శక్తివంతమైన MediaTek Dimensity 8200 గేమింగ్ ప్రాసెసర్‌తో రాబోతోంది. V30 మొబైల్ మాత్రం MediaTek Dimensity 800 ప్రాసెసర్‌తో లభించనుంది. 

Also Read: DA Hike: మార్చ్ నుంచే ఉద్యోగుల డీఏ పెంపు, భారీగా పెరగనున్న కనీస వేతనం

ఇక రెండు స్మార్ట్ ఫోన్ల బ్యాటరీల విషయానికొస్తే.. V30 స్మార్ట్ ఫోన్ 4100mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రో విషయానికొస్తే 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 88W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రో ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అతి తక్కువ ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి V30 మంచి ఎంపికగా భావించవచ్చు.

Also Read: DA Hike: మార్చ్ నుంచే ఉద్యోగుల డీఏ పెంపు, భారీగా పెరగనున్న కనీస వేతనం

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News