Death Of Youth While Dancing: మరణం ఎప్పుడు ఎవరిని పిలుస్తుందో చెప్పలేం.. అది ఏ రూపంలో వస్తుందో ఊహించడం కూడా కష్టం. ఆహారం తింటున్నప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా వ్యక్తులు ఆకస్మికంగా మరణించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లకు వరకు హార్ట్ ఎటాక్ గురై ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా పార్డి గ్రామంలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ.. ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు (19) నిర్మల్ జిల్లా పార్డి గ్రామానకి బంధువుల పెళ్లికి వచ్చాడు. శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించగా.. అందరూ సినిమాలకు డ్యాన్సులు వేస్తూ ఎంతో ఉత్సాహాంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు కూడా ఓ పాటకు డ్యాన్స్ వేస్తుండగా.. బంధువులు ఈలలు, కేకలతో ఉత్సాహపరిచారు. ఎంతో సంతోషంగా నవ్వుతూ డ్యాన్స్ వేస్తున్న క్రమంలో అనుకోకుండా ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు.
19 year old Muthyam from #Maharashtra died of sudden cardiac arrest while dancing in a wedding in #Telangana pic.twitter.com/k6SRbZu1X4
— ABS (@iShekhab) February 26, 2023
డ్యాన్స్‌లో భాగంగా కిందపడిపోయాడేమో అనుకుని.. పక్కన ఉన్న వాళ్లు ఇంకా గట్టిగా విజిల్స్ వేశారు. ఎంతసేపైనా యువకుడు పైకి లేకపోవడంతో ఓ వ్యక్తి యువకుడిని పైకి లేపడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ యువకుడు అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు.
ఎంతో ఫిట్‌గా ఉన్నా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా ఉంటోంది. రీసెంట్‌తో హైదరాబాద్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. జిమ్ వర్కౌవుట్లు చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ విశాల్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విశాల్ వర్కౌట్స్ చేయడం నుంచి కుప్పకూలే వరకు అక్కడి దృశ్యాలన్నీ జిమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్ విధానంలో కీలక మార్పులు..?
Also Read: Doctor Preethi Death: మృత్యువుకు తలవంచిన ప్రీతి.. విషాదంలో కుటుంబం, స్నేహితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి