తెలంగాణ రాష్ట్రంలో నేటినుంచి 24 గంటల విద్యుత్

ముఖ్యమంత్రి కల సాకారమైంది. దేశంలో మరే రాష్ట్రం చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపింది.

Last Updated : Jan 1, 2018, 06:41 PM IST
తెలంగాణ రాష్ట్రంలో నేటినుంచి 24 గంటల విద్యుత్

ముఖ్యమంత్రి కల సాకారమైంది. దేశంలో మరే రాష్ట్రం చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపింది. ఆదివారం అర్థరాత్రి నుంచి తెలంగాణ పంటపొలాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు.. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల కరెంట్ సరఫరాను ప్రారంభించాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. కాబట్టి రైతులు ఆటో స్టాటర్లను తొలగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రైతులు భూగర్భ జలాలను కాపాడుకోవాలని.. ఆటో స్టాటర్ల ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం చెప్పింది.

కాగా.. వివిధ ప్రాంతాల్లో మంత్రులు విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట చివ్వెంల మండలం కుడకుడలో 24 గంటల విద్యుత్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి రైతులతో కేక్ కట్ చేయించారు.

విద్యుత్ రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ.. ఆదివారం అర్థరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషానికి.. తెలంగాణ రాష్ట్రం అంతటా నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా పథకం  ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోతాయపల్లి గ్రామంలో చింతల వెంకటరెడ్డి పొలంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు ట్రాన్స్-కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ తెలిపారు. ఇక వ్యవసాయానికి విద్యుత్ కోతలు ఉండవని.. బోర్లు నిరంతరాయంగా పనిచేస్తాయని అన్నారు.

Trending News