Revanth Reddy: ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Condoles Death Of Solipeta Ramalinga Reddy Death) ) తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహిళల బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus cases in Telangana) నివారణ చర్యలు, కోవిడ్19 పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
KCR To Meet Santosh Babu Family | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనను అధికారులు ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం కేసీఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు.
Colonel Santosh Babu | అమరవీరుడు, కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కుటుంబ సభ్యులు నేడు నిమజ్జనం చేశారు. కుమారుడికి నిర్వహించాల్సిన సాంప్రదాయ కార్యక్రమాలను సంతోష్ బాబు తల్లిదండ్రులు పూర్తిచేస్తున్నారు.
చైనాతో ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లా వాసి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ (CM KCR Announces RS 5 crore to Santosh Babu family)పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య అంశాలలో నీరు ఒకటి. టీఆర్ఎస్ సర్కార్ తాగు, సాగునీటిపై అందుకే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. రామచంద్రారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామం. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్.. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.