మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్న భాగ్యనగరం

హైదరాబాద్ నగరం  మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది.

Updated: May 16, 2019, 09:23 PM IST
మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్న భాగ్యనగరం

హైదరాబాద్‌ నగరం మరో అంతర్జాతీయ సదస్సు వేదిక కానుంది. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో 31వ వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలు మహానగరంలో జరగనున్నాయి.  రెండు రోజులపాటు జరిగే సమావేశంలో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరచగా.. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌, ఇండియా అని స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు.