ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ రియాక్షన్

తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఘటనలపై నటి పూనమ్ కౌర్ స్పందించింది

Updated: Apr 23, 2019, 11:37 AM IST
ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ రియాక్షన్

తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ స్పందించింది. విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఒక్క మార్కుతో ఫెయిల్ అయ్యాడని బిల్డింగ్ పై నుంచి దూకేశాసిన ఘటనను ప్రస్తావిస్తూ...ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నానని  పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం, మార్కుల విషయంలో ఒత్తిడి తీసుకురావడం భావ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఎవరైన  విద్యార్ధి ఫెయిల్ అయితే తను ఎందుకూ పనికిరాడని దూషిస్తూ విద్యార్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి పూనర్ కౌరౌ తనదైన శైలిలో స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేసింది.