Agnipath Protests: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ లో ఎంపికై అగ్నివీర్లుగా నాలుగేళ్లు పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అగ్నివీర్లకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్ నియామకాల్లో అగ్నివీర్లకు వయో పరిమితిని 3 ఏళ్లకు పెంచారు. అగ్నివీర్ మొదటి బ్యాచ్ వారికి కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022
The MHA also decides to give 3 years age relaxation beyond the prescribed upper age limit to Agniveers for recruitment in CAPFs & Assam Rifles. Further, for the first batch of Agniveer, the age relaxation will be for 5 years beyond the prescribed upper age limit.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022
READ ALSO: Agnipath Scheme Age Limit Extended: అగ్నిపథ్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.