Telangana: ఫెయిలైన విద్యార్ధులు కూడా పాస్

కోవిడ్ 19 ( Covid19 ) సంక్రమణ ఆ విద్యార్ధులకు వరంగా మారింది. కరోనా పుణ్యమా అని ఎటువంటి పరీక్షల్లేకుండానే పాస్ అయిపోయారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలైన విద్యార్ధులంతా ఇకపై పాస్ అయిపోయారు.

Last Updated : Jul 9, 2020, 07:03 PM IST
Telangana: ఫెయిలైన విద్యార్ధులు కూడా పాస్

కోవిడ్ 19 ( Covid19 ) సంక్రమణ ఆ విద్యార్ధులకు వరంగా మారింది. కరోనా పుణ్యమా అని ఎటువంటి పరీక్షల్లేకుండానే పాస్ అయిపోయారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలైన విద్యార్ధులంతా ఇకపై పాస్ అయిపోయారు.

తెలంగాణా ప్రభుత్వం ( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షల్ని రద్దు చేయడం వల్ల...ఇంటర్ సెకండియర్ పరీక్ష ( Inter 2nd year Exams ) ల్లో ఫెయిలైన విద్యార్ధులందర్నీ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏకంగా లక్షా 47 వేల మంది విద్యార్ధులు పాస్ అయిపోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫెయిలైన విద్యార్ధులకు ఓ వరంగా మారింది. Also read: జీహెచ్ఎంసీలో కరోనా ర్యాపిడ్ టెస్టులు షురూ

వాస్తవానికి ఇటీవల విడుదలైన ఇంటర్నీడియెట్ ( Intermediate ) పరీక్ష ఫలితాల్లో లక్షా 47 వేల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. అటు పాసైన విద్యార్దులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పదిరోజుల్లో పూర్తి కానుంది. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం పాస్ చేసిన విద్యార్ధులందరికీ కంపార్ట్ మెంట్ పాస్ వర్తించనుంది. 

Trending News