New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించింది తెలంగాణ సర్కార్. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేసింది. జులై 14వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపించే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Harish Rao Demands To Revanth Reddy Resignation: కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసూరు పోసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు సవాల్ చేశారు.
Ponnam Prabhakar Trvel In RTC Bus: ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్‌గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ వెళ్లే బస్సులో పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేసి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లను పలకరించి మీ సమ్మెను మాట్లాడి ఆపివేయించామని గుర్తుచేశారు. అనంతరం మహిళలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు.
Harish Rao Reacts On Operation Sindoor: భారతదేశం పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై భారత సైనికులకు హరీశ్ రావు సలామ్ చేశారు. 'మనమందరం భారతీయులం. ఒక్క తాటిపై ఉండాలి. యావత్ భారత జాతి భారత సైనికుల పక్షాన నిలుస్తున్నది. కులం, మతం, జాతి, ప్రాంతం లేదు మనమందరం ఒక్కటై బలాన్ని చాటుదాం' అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Harish Rao: మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులకు కష్టాలు ఎదురయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. రైతుబంధు, రుణమాఫీ పేరిట రైతులను గోస పెట్టారని గుర్తుచేశారు.
Harish Rao Slams To Revanth Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు ఎదురయ్యాయని.. వరి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ధాన్యానికి సరైన ధర లభించడం లేదని తెలిపారు.
Harish Rao Clean Shave Of Head Amid BRS Party Silver Jubilee Meeting: తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమం.. అధికారం.. ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త అవతారంలో కనిపించారు. అకస్మాత్తుగా గుండు చేయించుకుని కనిపించడంతో అందరూ విస్తుపోయారు. అసలు గుండు ఎందుకు చేయించుకున్నారో తెలుసుకుందాం.
Harish Rao Get Tears In Siddipet: తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందని ఓ చిన్నారి చెప్పి కథ విని స్టేజిపైనే కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి హరీష్‌రావు . సిద్దిపేటలో పాఠశాల విద్యార్థులకు 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అవగాహన సదస్సు నిర్వహించగా ఈ సభలో పాల్గొన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చిన్నారిని ఓదార్చి పక్కనే కూర్చోబెట్టుకుని ధైర్యం నూరిపోశారు.
Harish Rao Attends Sri Rama Navami In Siddipet:సిద్దిపేటలోని పలు దేవాలయాల్లో శ్రీ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పారుపల్లి వీధిలో ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, పుస్తె మట్టెలు సమర్పించారు. అనంతరం కల్యాణాన్ని కనులారా తిలకించారు.
Harish Rao Review BRS Party Silver Jubilee Meeting: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలపడంతో దిష్టి తగిలింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Harish Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని.. గ్రామసభలు పోలీసుల బందోబస్తులో నిర్వహించడం ఏమిటని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రకటించారు.
Ex Minister Harish Rao Demands President Rule In Telangana: తెలగాణలో క్రైమ్ రేటు పెరగడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కార్యాలయాలపై, ఎమ్మెల్యేలపై దాడి జరుగుతుండడంతో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు.
Harish Rao New Year Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
Harish Rao Slams To Revanth Reddy About Employees Pending Salaries: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Harish Rao Fire On Revanth Reddy Against FIR Filed: తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తాజాగా పంజాగుట్ట స్టేషన్‌లో నమోదైన కేసుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేసినా రేవంత్ రెడ్డి నిన్ను వదల అంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్‌నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Harish Rao Condemns KTR Brother In Law Farm House Party Issue: కేటీఆర్ బావ మరిది కుటుంబసభ్యులు పాల్గొన్న దావత్‌ను డ్రగ్స్ పార్టీగా పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.