Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) కేసులు విజృంభిస్తున్నాయి. సాధరణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Last Updated : Jul 29, 2020, 02:23 PM IST
Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

Armur MLA tested Corona positive: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) కేసులు విజృంభిస్తున్నాయి. సాధరణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ( TRS ) ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ( Asannagari Jeevan Reddy ) కి బుధవారం కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌‌లో ఉన్నారు.  Also read: Telangana: తాజాగా 1,764 కరోనా కేసులు.. 12మంది మృతి

ఇదిలాఉంటే.. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనా బారినపడి కోలుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత హోం మంత్రి మహమూద్ అలీ కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కరోనా బారినపడి ఇంకా చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకడంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నారు. Also read: Covid-19: ఇలా వారంలోనే కోలుకున్నా: హీరో విశాల్

Trending News