Bandi Sanjay to KCR: కేసీఆర్‌కి బండి సంజయ్ బహిరంగ లేఖ... రేవంత్ రెడ్డికి సమాధానమా ?

Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్‌, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..

Written by - Pavan | Last Updated : May 31, 2023, 05:05 AM IST
Bandi Sanjay to KCR: కేసీఆర్‌కి బండి సంజయ్ బహిరంగ లేఖ... రేవంత్ రెడ్డికి సమాధానమా ?

Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: హైదరాబాద్ : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.. ఓఆర్ఆర్ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదు అని ఈ లేఖ ద్వారా కేసీఆర్ ని నిలదీసిన బండి సంజయ్.. మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి అని అభిప్రాయపడ్డారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి ? టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్‌  ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేసిన బండి సంజయ్.. మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి అని కేసీఆర్ సర్కాకు సవాల్ విసిరారు.

ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ పై ఏడాదికి రూ.415/- కోట్ల ఆదాయం వస్తుంది. ఇది ప్రతీ యేడు 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30,000/- కోట్ల ఆదాయం చేకూరేది. ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోవడం వెనకవున్న ఆంతర్యం ఏమిటి? రాష్ట్రానికి రావల్సిన ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్‌ ఇవ్వడం వెనుక జరిగిన తతంగం ఏమిటి? అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోంది? హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ టెండర్‌ దక్కించుకున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ (ఐఆర్బీ)  సంస్థనే మహారాష్ట్రలోని ముంబై – పుణె ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబై–పుణె నేషనల్ హైవే –4 టోల్ గేట్లతోపాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా నిర్వహిస్తోంది. దీని పరిధి 1014 లేన్‌ కిలోమీటర్లు. ఒప్పంద కాలం 10 యేండ్లు. ఆదాయం రూ.8,875/- కోట్లు. మరి తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ అప్పగించినప్పుడు ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్‌, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై ప్రభుత్వ మార్గదర్శకాల టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి.. ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే ఉంచింది. బేస్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. మరోవైపు ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతున్నది. ప్రశ్నించే పార్టీలకు లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నది. అసలు ఈ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అట్లాగే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ సీఎం కేసీఆర్ కి రాసిన బహిరంగ లేఖలో బండి సంజయ్‌ కుమార్‌ పట్టుపట్టారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కేసీఆర్ సర్కారు భారీ మొత్తంలో అవినీతికి పాల్పడింది అని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు అంటూ ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ మౌనం వెనుక కేసీఆర్ కి మద్దతు ఉందని అనుకోవాలా అని ఆరోపించారు. ఇదిలావుంటే, తాజాగా కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ రాయడం చూస్తోంటే.. బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు పనిలో పనిగా రేవంత్ రెడ్డికి సైతం సమాధానం చెప్పినట్టయింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trending News