Rachakonda CP Reacts Insta Influencer Money Hunting Challenge: విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓఆర్ఆర్ వద్ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా అతడి ఆటను పోలీసులు కట్టిపెట్టారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన అతడిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..
Revanth Reddy About ORR Scam: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో, కేటీఆర్ విదేశాల్లో స్థిరపడినా వందల కోట్లు వచ్చిపడేలా ఆదాయ వనరులు ప్లాన్ చేశారన్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్కి సమీపంలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు ( Prabhas adopts forest land ). తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ( Uppalapati Suryanarayana Raju ) పేరిట ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభాస్ తెలిపారు.
నగర శివార్లలోని శామీర్పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కింద ఉన్న రోడ్డుపై పడింది. సిమెంట్ బస్తాల లోడుతో కీసర నుంచి బయల్దేరిన లారీ మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.