BRS Party: కేసీఆర్‌, కేటీఆర్‌కు భారీ షాక్‌.. సీఎం చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల భేటీ

Big Shock To KCR And KT Rama Rao: ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా దెబ్బతింటుండగా.. ఈసారి టీడీపీ ఫిరాయింపులకు తెరలేపుతున్నట్లు సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 7, 2024, 03:00 PM IST
BRS Party: కేసీఆర్‌, కేటీఆర్‌కు భారీ షాక్‌.. సీఎం చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల భేటీ

BRS Party MLAs Meets To Chandrababu: తెలంగాణలో మళ్లీ ఎమ్మెల్యేల ఫిరాయింపు జరుగుతుందా? రాజకీయంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం కనిపిస్తోంది. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకనున్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీ కాంగ్రెస్‌ కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.

Also Read: Nagarjuna: మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేసిన నాగార్జున..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. కొన్ని నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వస్తున్న క్రమంలో తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను టీడీపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. తనతో పాటు మరికొంత మంది కూడా చేరుతరని ప్రకటించారు. 

Also Read: Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..

 

 

'హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం, చంద్రబాబు వల్లనే. తెలంగాణలో ఇంకా టీడీపీ, ఎన్టీఆర్‌ అభిమానులు చాలా మంది ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం. త్వరలో తెలుగుదేశంలో వంద శాతం చేరుతా. నాతో పాటు చాలా మంది నాయకులు టీడీపీలోకి వస్తారు' అని ప్రకటించారు. అయితే మామాఅల్లుళ్లు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించి వెంటనే కారు ఎక్కారు.

వీరి భేటీతో తెలంగాణలో రాజకీయంగా కలకలం ఏర్పడింది. మళ్లీ ఫిరాయింపు రాజకీయాలు మొదలయ్యాయని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీని ఇప్పటికే అధికార కాంగ్రెస్‌ చీల్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇప్పుడు టీడీపీ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. గతంలో మల్లారెడ్డి టీడీపీలో పని చేసిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఎంపీగా పని చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా చంద్రబాబుతో సమావేశమవడంతో వారు టీడీపీలోకి చేరుతారని చర్చ జరుగుతోంది.

అయితే తాము రాజకీయంగా కాదు వ్యక్తిగత పనుల కోసం చంద్రబాబును కలిసినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు, మల్లారెడ్డి తన మనవరాలు పెళ్లికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వివాహం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను మల్లారెడ్డి కలిసి ఆహ్వానించారు. అదే క్రమంలో చంద్రబాబును కలిశారని చెబుతున్నారు. అంతేకానీ రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదని పేర్కొంటున్నారు. అయితే ఇదే సమావేశంలో తిరుమల దర్శనం సిఫారసు లేఖలకు అనుమతించాలని సీఎం చంద్రబాబును కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x