BJP Hanmkonda Public Meeting: నేడే హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా..

BJP Hanmkonda Public Meeting: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు హనుమకొండలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 27, 2022, 07:44 AM IST
  • హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ
  • ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ
  • హాజరుకానున్న జేపీ నడ్డా
BJP Hanmkonda Public Meeting: నేడే హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా..

BJP Hanmkonda Public Meeting: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నేడు (ఆగస్టు 27) హనుమకొండలో జరగనుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ తదితర నేతలు పాల్గొననున్నారు.

భద్రకాళి ఆలయం వద్ద ముగియనున్న పాదయాత్ర :

సాధారణంగా బండి సంజయ్ పాదయాత్ర ప్రతీరోజూ 15 కి.మీ మేర సాగుతోంది. కానీ శుక్రవారం ఒక్కరోజే 30 కి.మీ పాదయాత్ర చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం రాత్రి ఐనవోలులో బస చేయాల్సి ఉండగా వరంగల్ శివారులోని బొల్లికుంటలో ఉన్న వాగ్దేవి కాలేజీలో బస చేశారు. శనివారం భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద పాదయాత్ర ముగియనుంది. అనంతరం జేపీ నడ్డా, బండి సంజయ్ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

జేపీ నడ్డా షెడ్యూల్ ఇదే : 

జేపీ నడ్డా సతీసమేతంగా తెలంగాణకు రానున్నారు. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెడుతారు. నోవాటెల్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం హోటల్లోనే పలువురు ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కి బయలుదేరుతారు. 3.15 గం. సమయంలో బండి సంజయ్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. 3.30 గంటలకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి వెళ్తారు. 3.45 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అవుతారు. 4.10 గంటలకు సభ జరిగే ఆర్డ్స్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.40 గం. వరకు సభలోనే ఉంటారు. తిరిగి శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ టాలీవుడ్ హీరో నితిన్, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌లతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం త్రిపురకు బయలుదేరుతారు.

సభకు ఎట్టకేలకు లైన్ క్లియర్ :

హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సభకు కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు అనుమతులిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో లైన్ క్లియర్ అయింది. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు షరతులు విధించింది.

Also Read: Horoscope Today August 27th : ఇవాళ శ్రావణ మాసం చివరి రోజు.. ఏయే రాశుల జాతకం ఎలా ఉందంటే...

Also Read: Bigg Boss Telugu season 6: కంటెస్టెంట్స్ లిస్టు లీక్.. ఎవరెవరు ఉన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News