BJP MP K.Laxman on TRS: టీఆర్‌ఎస్‌కు అసలు సినిమా ముందుంది..బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ హాట్ కామెంట్స్..!

BJP MP K.Laxman on TRS: తెలంగాణలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి. టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ పాలనపై టీఆర్ఎస్ ఫైర్ అవుతుంటే..రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 8, 2022, 07:22 PM IST
  • తెలంగాణలో రాజకీయ వేడి
  • టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీ
  • తాజాగా లక్ష్మణ్‌ విసుర్లు
BJP MP K.Laxman on TRS: టీఆర్‌ఎస్‌కు అసలు సినిమా ముందుంది..బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ హాట్ కామెంట్స్..!

BJP MP K.Laxman on TRS: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత కె. లక్ష్మణ్‌ ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. అధికార టీఆర్ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.

ఈ విషయంలో బీజేపీది ప్రేక్షకపాత్ర అని స్పష్టం చేశారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక కేవలం ట్రైలర్ మాత్రమేనని..అసలైన సినిమా ముందుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన లక్ష్మణ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సత్కరించారు.

ఈసందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజ్యసభకు ఎంపిక చేసిన పార్టీ పెద్దలకు లక్ష్మణ్‌ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో పుంజుకుని..అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also read: Uddhav Thackeray: శివసేన పార్టీ, గుర్తు తమదే..శిండే ద్రోహం చేశారన్న ఉద్ధవ్ ఠాక్రే..!

Also read:Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..కాల్చి చంపబడిన రాజకీయ నాయకులు వీరే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News