Bandi Sanjay On Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నిధులిచ్చామని తాము లెక్కలతో సహ వివరించామని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారు..? ఎంత అప్పు చేశారు..? అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 45 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. బై ఎలక్షన్స్‌లో డిపాజిట్లే దక్కని పార్టీకి అన్ని సీట్లు ఎలా వస్తాయని అడిగారు. కాంగ్రెస్ చేయించుకున్న సొంత సర్వేలో 100 సీట్లు వస్తాయని కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలున్నారని కామెంట్స్ చేశారు. మహా జనసంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆయన ఆదివారం కరీంనగర్‌కు విచ్చేశారు.
కరీంనగర్ రూరల్ మండలం బద్దిపల్లి గ్రామ శివారులో పార్టీ కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ టిఫిన్ బైఠక్ సమావేశం నిర్వహించారు. అనంతరం మహా జనసంపర్క్ అభియాన్ ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తలకు చెప్పారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వెల్లడించారు. సోషల్ మీడియా టీమ్‌తో ఆయన భేటీ అయ్యారు. మోదీ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
బీజేపీ అధికారంలోకి ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది అందరికీ న్యాయం చేస్తాం. ధరణి పోర్టల్‌తో కేసీఆర్ కుటుంబానికే లాభం జరుగుతోంది. పార్లమెంట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఎక్కడైనా పనిచేశాయా అని అడిగారు. ఆ రెండు పార్టీలు కలిసే పరేడ్ చేస్తున్నాయని.. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారందరూ బీఆర్ఎస్‌లో చేరుతున్నారని.. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ డిసైడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని.. వచ్చే ఎన్నికల్లో 45 సీట్లు వస్తాయని చెప్పడం పెద్ద జోక్ ఎద్దేవా చేశారు బండి సంజయ్. ప్రభుత్వంపై పోరాడితే కాంగ్రెస్‌కు డిపాజిట్లు ఎందుకు రావన్నారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు అన్నింటిని కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడని అన్నారు.
Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?
Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook