క్షుద్ర పూజల కలకలం.. నిందితుడు అరెస్ట్!

హైదరాబాద్‌లో తరచుగా వెలుగు చూస్తోన్న క్షుద్ర పూజలు

Last Updated : Feb 17, 2018, 12:42 AM IST
 క్షుద్ర పూజల కలకలం.. నిందితుడు అరెస్ట్!

హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న దోమలగూడలోని ఓ ఇంట్లో శుక్రవారం క్షుద్రపూజలు చేస్తున్నారనే వార్త కలకలం సృష్టించింది. ఓ ఇంట్లో పూజలు జరుగుతున్నాయనే అనుమానంతో స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. క్షుద్రపూజలు చేస్తోన్న శంకర్ లాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఘటనాస్థలంలో పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శంకర్ లాల్‌ ఏ దురుద్దేశంతో ఈ క్షుద్ర పూజలు చేస్తున్నాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

Trending News