Bonalu 2024: ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు..? మొట్టమొదటి బోనం హిస్టరీ ఇదే...

Ashada masam: బోనాలను ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరుపుకుంటారు. ఊరువాడ, పల్లె, పట్నం అని తేడాలేకుండా ప్రజలంతా వేడుకగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 8, 2024, 01:34 PM IST
  • తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి..
  • పూనకాలలో శివసత్తులు, పోతరాజులు..
Bonalu 2024: ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారు..? మొట్టమొదటి బోనం హిస్టరీ ఇదే...

ashada masam Bonalu tradition History and significance: తెలంగాణ అంతట ప్రస్తుతం ఆషాడమాసం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. గోల్కొండలో తొలిబోనం సమర్పించడంతో, బోనాలు ధూందాం కు అంకురార్పణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బోనాల పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు, అధికారులు కూడా బోనాల ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.  బోనాల పండుగ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

ఇక భాగ్య నగరంలో బోనాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి గల్లి, ప్రతి గుళ్లను పెయింటిండ్ వేసి అందంగా ముస్తాబుచేస్తారు. వేప కొమ్మలతో తోరణాలు కడతారు. అమ్మవారికి బోనం, అన్నం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆషాడ మాసమంతా ఒక రేంజ్ లో హల్ చల్ ఉంటుందని చెప్పుకొవచ్చు.

బోనాలు ఆషాడంలోనే ఎందుకు..?

బోనాల పండుగలను ఆషాడ మాసంలోనే నిర్వహిస్తారు. సాధారణంగా ఆషాడమాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకే భక్తులు కూడా ఈ పండుగ సమయంలో.. ఆ మూడు లోకాల తల్లిని తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి, ప్రత్యేకంగా భక్తితో, బోనం చేసి అమ్మవారిని కొలుచుకుంటారు. అంతేకాకుండా.. దగ్గరలోని గుడిలో, తమ కులదైవం ఆలయంలో బోనం వండుకుని తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పిస్తుంచుకుంటారు.

కొందరు అన్నం, కోళ్లు, మేకలను కూడా ఆలయాల దగ్గర బలిస్తుంటారు. బోనాలను తలపై పెట్టుకున్న వారిలో అమ్మవారే స్వయంగా ఉంటారని కూడా భక్తులు నమ్ముతుంటారు. అందుకే ముఖమంతా పసుపు, కాళ్లకు పసుపు పారాణి, చేతుల నిండా గాజులు.. అచ్చం అమ్మవారే నడిచి వస్తున్నట్లు బోనాలు నేపథ్యంలో మహిళలు కన్పిస్తుంటారు.

గతంలో గ్రామాలల్లో కలరా, ప్లేగు, మశూచీల వంటి ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి.  ఈ వ్యాధిని గతంలో గత్తెర అని పిలిచేవారు. దీన్ని అమ్మవారు కాపాడతారని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే  ఇప్పటికి కూడా వర్షాకాలం ప్రారంభంకాగానే..వేపాకు నీళ్లు, పసుపు నీళ్లను చాలా మంది తమ ఇంటి చుట్టుపక్కల చల్లుతుంటారు. ఇది యాంటి బయోటిక్ గా పనిచేయడంతోపాటు, వైరస్ లను సమూలంగా నిర్మూలిస్తాయి. అంతేకాకుండా.. అమ్మవారు ఇంట్లో, గ్రామంలో చెడు గాలులు, చెడు ప్రభావాలను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

తొలిబోనం హిస్టరీ ఇదే..

బోనాల పండుగ వెనుక వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. బోనాల పండుగ అనేది పల్లవ రాజుల కాలానికి ముందు కాలం నుంచే ఉండేదని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఏడుకోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించారంట. ఆయన అక్కడ తొలి బోనం సమర్పించినట్లు చరిత్రలో ఉంది. ఇంకా చెప్పాలంటే 1869వ సంవత్సరంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించి చాలామంది చనిపోతూ ఉంటే అక్కడివారు గ్రామదేవతలకు పూజలు జరిపించి బోనం ఎత్తారు.

దీనివల్ల భాగ్య నగరంలో ప్లేగు తగ్గిపోయినట్లు చరిత్రలో ఉంది. అప్పటినుంచి హైదరాబాదులో బోనాల పండుగ కొనసాగుతుంది.అలాగే నిజాం ప్రభువుల కాలంలో కూడా ఈ పండుగ ఘనంగా జరిగేదని చరిత్ర చెబుతోంది. నిజాం ప్రభువులు, కుతుబ్ షాహీల కాలంలో కూడా బోనాల పండుగను నిర్వహించారంట.  ముస్లిం మతానికి చెందినవారైనా బోనాల పండుగను జరిపేందుకు పూర్తిగా సహకరించేవారని చెప్తుంటారు. అందుకు అప్పటి కాలం నుంచి గోల్కొండలోని జగదాంబ అమ్మవారి ఆలయం అని చెబుతున్నారు.

బోనం అంటే భోజనం అని అర్థం వస్తుంది.బోనాల పండుగలో గ్రామ దేవతలకు మూడు కొత్త కుండలో భోజనం వండుతారు. అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం సిద్దం చేస్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయతో చేసిన అన్నం, పెరుగు, పాలు, బెల్లం ను మట్టి కుండలలో పెట్టి వాటిని అందంగా అలంకరిస్తారు. 

Read more:Potharaju: పోతరాజు ఎవరు?.. బోనాల పండుగలో అమ్మవారి పక్కనే ఆయన ఎందుకుంటారో తెలుసా..?

ఆ తర్వాత ఆ కుండపై దివ్వె పెట్టి ఆడపడుచులు నెత్తిపై బోనం ఎత్తుకొని ఒక చేతిలో వేపాకు పట్టుకుని డప్పు చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తుండగా.. తమ గ్రామదేవతలైన పోలేరమ్మ, మారెమ్మ, డొంకలమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మగా పిలిచే గ్రామ దేవతలకు బోనంని,సాకని సమర్పిస్తారు. గొల్గొండ బోనాలు 500 వందల ఏళ్ల చరిత్ర, సికింద్రాబాద్ ఉజ్జయినికీ అమ్మవారి బోనాలకు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తుంటారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News